త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 

ప్రతి ఒక్కరు  చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

On
త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం 

త్రీటౌన్ సీఐ శివప్రసాద్

IMG20250624131903 కొత్తగూడెం(న్యూస్ ఇండియా నరేష్): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు డి.ఎస్.పి రెహమాన్ సూచనలతో కొత్తగూడెం త్రీ టౌన్   పోలీసులు నార్కోటిక్ పై  యాంటీ డ్రగ్   సోల్జరు అవగాహన కార్యక్రమాన్ని కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ శివప్రసాద్ మాట్లాడుతూ.. యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా ఈనెల 20 నుంచి 26 వరకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ చెడు అలవాటులకు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాల బారినపడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని  అన్నారు. వారి వల్ల వారి కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారని అన్నారు. ఇంట్లోని మగవారు బాగుంటేనే వారి కుటుంబం బాగుంటుందని అన్నారు. డ్రగ్స్ పై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలనుకుంటే టోల్ ఫ్రీ నెంబర్  1908, నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్14446 కాల్ చేయగలరని కోరారు . ఈ కార్యక్రమంలో ఎస్సై విజయ కుమారి, ఏఎస్ఐ బివిఆర్ రఘు, సిబ్బంది రామారావు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Views: 18
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక