ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.

On
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వీక్లీ పెరేడ్.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 14, న్యూస్ ఇండియా : క్రమశిక్షణతో విధులు నిర్వహించి,  జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని, పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ ఆదేశానుసారం తేది: 14.06.2025 నాడు పోలీసు పరేడ్ గ్రౌండ్స్ నందు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీసు సిబ్బందికి డియస్పీ నరేందర్ ఆద్వర్యంలో వీక్లీ పరేడ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ప్రకటనలో ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఫిజికల్ ఫిట్నెస్ చాలా కీలకం అని, శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ తో ఉన్నప్పుడే ఎలాంటి పరిస్థితులలోనైనా విధులను సమర్ధవంతంగా నిర్వర్తించగలమని, ఫిట్నెస్ ను కాపాడుకోవడానికి ప్రతి రోజు వ్యాయామం, యోగా వంటివి చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది వీధి నిర్వహణలో అంకిత భావంతో పని చేయాలని, తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలని అన్నారు. విఐపి పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా విధులు నిర్వహించే అధికారులు విఐపి భద్రత విషయమై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో గల సస్పెక్ట్స్, హిస్టరీ షీటర్ల గురించి పూర్తి అవగాహన కలిగి, నిఘా ఉంచాలని అన్నారు. మన చుట్టూ జరుగుతున్న ఆస్థి సంబంధిత నేరాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ గురించి ప్రజలలో కమ్యూనిటీ పోలిసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ వీక్లీ పెరేడ్ నందు ఎఆర్ డియస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, ప్లటూన్ ఇంచార్జ్ లు, సిబ్బంది తదితరులు ఉన్నారు.WhatsApp Image 2025-06-14 at 1.48.48 PM

Views: 1
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..!  పెద్దకడుబూరు మండలం : వైసీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం..! 
వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు వై. ప్రదీప్ రెడ్డిని కలిసిన పెద్దకడుబూరు వైసీపీ నాయకులు.
పాల్వంచలోని విద్యా సంస్థల అధినేత కేఎల్ఆర్ చిరస్మరణీయుడు
పద్మ శ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఉప్పల్ ఎమ్మెల్యే
#Draft: Add కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిYour Title
ఎల్బీనగర్ సైబర్ వారియర్ కు రాచకొండ కమిషనర్ ప్రశంస..
కూటమి పాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం - జగనన్న 2.0 ఏంటో మేము చూపిస్తాం... ఎమ్మెల్యే వై. బాలనాగి రెడ్డి.
పెద్దకడుబూరు : మహనీయుని స్మరణలో ఘనంగా వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు..!