అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు...

On
అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తాం..

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు...

IMG-20250726-WA0846
లబ్ధిదారులకు రేషన్ కార్డులు అందజేస్తున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు...

రంగారెడ్డి జిల్లా, జులై 26, న్యూస్ ఇండియా ప్రతినిధి:

అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందజేస్తామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు.
శనివారం పెద్ద అంబర్ పేట్ మున్సిపల్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ లోని తార కన్వెన్షన్  హాలులో అబ్దుల్లాపూర్మెట్ మండలం, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పరిధికి సంబంధించి రేషన్ కార్డుల పంపిణీకి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆయా మండలాల, మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి లతో కలిసి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

Read More విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేడు 10 వేల 50 మంది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని ఆయన అన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్ కార్డులు మాత్రమే అందించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకనూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని అన్నారు.తెల్ల రేషన్ కార్డులకు మంచి డిమాండ్ ఉందని, కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నందున రేషన్ కార్డులకు ప్రస్తుతం చాలా ప్రాధాన్యత ఉన్నదని ఆయన అన్నారు. 
అయితే అర్హులైన వారికే కార్డులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సమానంగా నిరుపేదలు కూడా సన్న బియ్యంతో కూడిన భోజనం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని భరిస్తూ అందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తోందని అన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని గుర్తు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలని మంత్రి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, ఐకేపీ, మెప్మా ద్వారా లక్ష రూపాయల వరకు రుణాలు కూడా అందిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద కుటుంబాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్యా బోధన తోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందని తెలిపారు. ముఖ్యంగా నీటి వసతి, బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్స్ నిర్మాణానికి రూ.22 కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని వివరించారు. రైతులకు కూడా ప్రభుత్వం ఇతోధికంగా మేలు చేకూరుస్తోందని అన్నారు. రైతులు సంప్రదాయంగా వస్తున్న వరి సాగుకు బదులుగా అధిక లాభాలు అందించే ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోకి రోడ్ల అభివృద్ధికి వంద కోట్లు నిధులు కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు పెద్ద అంబర్పేట్ మున్సిపల్ పరిధి రోడ్ల అభివృద్ధికి 25 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.

Read More అవినీతి, అసమర్థ అధికారుల దర్పణం: ఈ 'గోడ'

కలెక్టర్ సి నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. మండలాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.  జిల్లా వ్యాప్తంగా 14,572 కొత్త రేషన్ కార్డులతో పాటు 1 లక్షా 51 వేల మంది కొత్త సభ్యుల పేర్లను రేషన్ జాబితాలో చేర్చడం జరిగిందన్నారు. రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని అన్నారు. దీంతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని తెలిపారు. ఫలితంగా కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఇది నిరంతర ప్రక్రియ అని వెల్లడించిన కలెక్టర్, అర్హులైన వారు ఇంకనూ మిగిలి ఉంటే ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని, అదే సమయంలో అనర్హులకు కార్డులు రాకుండా పకడ్బందీగా వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయా దశలను అనుసరిస్తూ వెంట వెంటనే బిల్లులను వారి ఖాతాలలో జమ చేస్తున్నామని, ఉచిత ఇసుక అందుబాటులో ఉండేలా, లక్ష రూపాయల రుణ సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. 
ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి సన్నబియ్యం అందజేయడం జరుగుతుందని తెలిపారు.దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో సన్న బియ్యం అందజేస్తున్న ఘనత మనదే అని ఆయన అన్నారు.

Read More ఈ మోసగాడి 'ఆయుధం' పేరు ‘10 టివి’

స్థానిక శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇంకా మూడు మండలాలు, మూడు మునిసిపాలిటీ పరిధిలో మిగిలి ఉన్న రేషన్ కార్డుల పంపిణీ వారంలోపు అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్ల అభివృద్ధి ఛైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి,  గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పారిజాత, సివిల్ సప్లైస్ డీ.ఎం గోపికృష్ణ, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 15

About The Author

Post Comment

Comment List

Latest News