విధి నిర్వహణలో తనదైన శైలిలో :ఎస్ఐ నరేష్
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
కొత్తగూడెం (న్యూస్ ఇండియా బ్యూరో నరేష్ ):మద్యం సేవించి వాహనం నడిపేటప్పుడు ఒక్క క్షణం మీ కుటుంబాన్ని గుర్తు చేసుకోండి అంటూ కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆదివారం రాత్రి మరియు సోమవారం వేకువ జామున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు.వాహనదారులు మద్యం సేవించారా లేదా అని బ్రీత్ అనలైజర్ల ద్వారా పరీక్షించి మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు నిర్ధారణ అయినవారికి అవగాహన కల్పిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వచ్చినవారు మరల ఇంటికి వెళ్లేంతవరకు మీ భార్య పిల్లలు మీ కొరకే ఎదురు చూస్తూ ఉంటారని వారి గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అతిగా మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఏదైనా అనుకొని సంఘటనలు జరిగితే మీ కుటుంబం రోడ్డు పాలయ్యే ప్రమాదం ఉందని అన్ని విషయాలను ఆలోచించి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అన్నారు.
Comment List