విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

ఇద్దరు ఏపీ డీఎస్పీలు ఘటన స్థలంలో మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు..

On
విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

విజయవాడ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

ఇద్దరు ఏపీ డీఎస్పీలు ఘటన స్థలంలో మృతి.. ఇద్దరికీ తీవ్ర గాయాలు..

IMG-20250726-WA0122
ఘటన స్థలంలో నుజ్జునుజ్జైన స్కార్పియో..

నల్గొండ జిల్లా, చౌటుప్పల్, జూలై 26 న్యూస్ ఇండియా ప్రతినిధి: విజయవాడ జాతీయ రహదారి పై శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డిఎస్పీలు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ తోపాటు, కారులో ఉన్న అడిషనల్ ఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. చౌటుప్పల్ మండల పరిధిలోని కైతాపూర్ వద్ద జరిగిన ఈ రోడ్డు దుర్ఘటనలో పోలీసు అధికారులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి, లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. దీనితో కారులో ప్రయాణిస్తున్న డి.ఎస్.పి చక్రధర్ రావు, కాంతారావు అనే ఇద్దరూ ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడికక్కడే మృతి చెందారు. అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావుకు తీవ్ర గాయాలు కాగా, వాహన డ్రైవర్ నర్సింగ్ రావు పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Views: 8

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక