సీజ్ ద షాప్
• పోతిరెడ్డిపల్లి డిసిఎంఎస్ ఎరువుల షాపు ఆకస్మిక తనిఖీ • జిల్లాలో ఎరువుల కొరత లేదు • ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు -జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 30, న్యూస్ ఇండియా : సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి డిసిఎంఎస్ ఎరువుల షాపును బుధవారం జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఆకస్మిక తనిఖీ చేసారు. ఫర్టిలైజర్ షాపులో యూరియా స్టాక్ ను పరిశీలించారు. రోజువారీగా స్టాకు వివరాలు బోర్డుపైన ప్రదర్శించాలని అన్నారు. ‘ఈపాస్ మిషన్’ ద్వారానే రైతులకు ఎరువులు అమ్మాలన్నారు. అనంతరం ఒక రైతుతో కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు. రైతులు ఎరువులను అధిగ ధరకు ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువ రేటుకు అమ్మారని తెలియజేయడంతో జిల్లా కలెక్టర్ యూరియాను రైతులకు అధిక ధరకు విక్రయించినందుకు షాపును సీజ్ చేయమని డిఏఓ కు కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎరువుల కొరతలేదని, ఎవరైనా కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రైతులు డీలర్ల వద్ద కొనుగోలు చేసే విత్తనాలు ఎరువులకు సంబంధించిన రసీదులను విధిగా తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఫర్టిలైజర్ దుకాణదారులు విధిగా తమ స్టాక్ బోర్డును అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎరువుల కొరత తలెత్తకుండా అధికారులు వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి శివప్రసాద్ ,మండల వ్యవసాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comment List