ఈ మోసగాడి 'ఆయుధం' పేరు ‘10 టివి’
'అర్హత గల పెన్ను' కు సున్నం పెట్టిన 'కంత్రి' ఎవరు?
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జులై 20, న్యూస్ ఇండియా : శకుని పాచికలు మహాభారతంలో ఒక ముఖ్యమైన అంశం. శకుని అనే పాత్ర ఉపయోగించే పాచికలు, అతను కోరుకున్న సంఖ్యలు వచ్చేలా చేసే మాయా పాచికలు అని ప్రసిద్ధి చెందాయి. ఈ పాచికలతోనే శకుని, పాండవులను ఓడించి, వారి రాజ్యాన్ని, సంపదను కౌరవులకు కట్టబెట్టాడు. అదేవిధంగా,'10 టివి' బ్రాండ్ అనేది ‘పి.వి రావు అనే మోసగాడి’ కి ఒక బలమైన ఆయుధం. పి.వి రావు అనే వ్యక్తి ఉపయోగించే అస్త్రం పేరు '10 టివి'. అతడు కోరుకున్న పనులు చేయించుకొనుటకు, చేసే మోసాలకు మాయా పాచికలలాగ '10 టివి' పేరు ను ఉపయోగిస్తుంటాడు. ఈ '10 టివి' బ్రాండ్ తోనే పి.వి రావు అధికారులను సైతం ప్రభావితం చేసి, వారి ద్వారా మోసాలు చేస్తూ అడ్డదారిలో ఆస్తులు సంపాదిస్తుంటాడు. ఇతని మోసాలపై సంగారెడ్డి పట్టణంలో తోటి సహచర జర్నలిస్టులతో పాటు సాధారణ ప్రజల ద్వారా బహిరంగంగానే విమర్శలు వినిపిస్తూవుంటాయి.
2011 వ సం: నే అతడికి ఎలాంటి అర్హతలు లేకుండానే 10 టివి రిపోర్టర్ అనే పేరు ఆసరాగా తీసుకుని కంది గ్రామం, సర్వే నం 616 లో 200 (రెండు వందల గజాల) ప్రభుత్వ భూమి ని అతడి భార్య వి. రాజలక్ష్మి పేరున అక్రమ పట్టా సంపాదించాడు. ప్రభుత్వ అధికారులను ప్రభావితం చేశారా ? ఒక ‘ముఠ’ గా ఏర్పడి అవకతవకలకు పాల్పడ్డారా? 2011 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రా ఆవిర్భావం ఎలా జరిగింది? 2011 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సృష్టించారు? 2011 లో ఎవరి ఆలోచనలో నుండి ‘సంగారెడ్డి జిల్లా' ను సృష్టించారు? 2011 లోనే 'కంది మండలం' ఎట్లా సాధ్యమైంది? ఈ భవిష్యవాణి ఎవ్వరి సృష్టి? అనే విషయాలపై సంగారెడ్డి రురల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.అర్ నం.180-2025 నమోదు కబడినది తద్వారా విచారణ కొనసాగుతూవున్నది.
2023 వ సం: లో ప్రభుత్వ ఉద్యోగుల తో కుమ్మకై పాత్రికేయుల అర్హతల ప్రమాణాలు పాటించకుండా, 100 రూ. బాండ్ పేపర్ పై తప్పుడు సమాచారం పొందుపర్చి, నిజాలను దాచిపెట్టి, అబద్ధల ఆధారంగా ప్రమాణ పత్రాలు తయారు చేసి ‘10 టివి రిపోర్టర్ పి.వి రావు’ అధికారులకు సమర్పించాడు. అధికారులను సైతం ప్రభావితం చేసి, ప్రత్యేక్షంగా, పరోక్షంగా క్రిమినల్ ఆక్టివిటీస్ చేసి ప్రో. నం. బి /2246 /2023 తేది. 26-07-2023 నాడు 'ఇంటి స్థలం పట్టాలు' అక్రమంగా పొందినాడు. ఈ విధంగా 'అర్హత గల జర్నలిస్టుల నోటికాడి బుక్కను అపహరించి' సాటి అర్హతగల జర్నలిస్టు హక్కును దొంగలించాడు. ఇల్లాంటి పలు 'కంత్రి' పనులు ఇతడికి వెన్నెతో పెట్టిన విద్య అని తోటి జర్నలిస్టులు ‘ముఖం పట్టుకొని తరచుగా అంటూ ఉంటారు’. ఇతడి పై క్రిమినల్ కేసులు కట్టి లోతైన విచారణ జరిపితే 'కోట్ల రూపాయల అవినీతి ఆస్తులు' బయటపడే అవకాశం లేకపోలేదు అని తోటిపాత్రికేయులు గుసగుసలాడుతున్నారు.
Comment List