'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి

On
'సంగారెడ్డి' పరువు తీస్తున్న అవినీతి

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, జూన్ 23, న్యూస్ ఇండియా : కొంత మంది 'అవినీతి అధికారుల కక్కుర్తి పనులవల్ల' సంగారెడ్డి పట్టణం పరువు పోతుందని, చాల సిగ్గుపడాల్సిన విషయమని  సంగారెడ్డి ప్రజలు బహిరంగంగానే మాట్లాడుకొంటున్నారు. రోజుకొకటి వెలుగులోకి వస్తున్న 59 జి ఓ అక్రమ క్రమబద్దికరణ భూ బాగోతాలు బయటపడుతున్న ఈ తరుణం చూస్తుంటే.. ప్రజా ప్రతినిధులు సిగ్గుపడవల్సిన విషయమని సామజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణం మంజీరా నగర్ బై పాస్ రోడ్డుకు అనుకోని ఉన్న కల్వకుంట సర్వే నెంబర్ 210 లోని లే అవుట్ నెంబర్ 368/87 పరిధిలోని రోడ్డు స్థలాన్ని సైతం  తప్పుడు పత్రాలతో లేనిది వున్నట్టుగా తప్పుడు విషయాలను ద్రువీకరిస్తున్నారని తెలియచేసారు. ఇండ్లు లేకున్నా? ఉన్నట్లు ఇంటి నెంబర్లు పొంది 59 జి. ఓ కింద సర్వే నెంబర్ మార్చి 374 సర్వే నెంబర్ తో అక్రమంగా క్రమబద్దికరణ కోసం చేసుకున్న ధరఖాస్తును పెట్టుకోవడం ఎంతైనా దారుణం అని తూర్పురపట్టరు. సరైన పత్రాలు క్షేత్ర స్థాయి లో తనిఖీ చేయకుండా రోడ్డు ఖాళీ స్థలాన్ని క్రమబద్దికరణ చేసిన సంగారెడ్డి మండలం రెవిన్యూ అధికారులు చట్టాలను కాలరాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ స్థలం లో కడిలు పాతి  నిర్మాణ పనులు చేస్తున్న ఆక్రమణ దారుని పై సంగారెడ్డి ఆర్ డి ఓ , తహసీల్దార్ సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి లకు స్థానికులు ఫిర్యాదు చేశారు.59 go copy

Views: 125
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News