కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

On
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల అభివృద్ధి

*👉🏻నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్*
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ తెలిపారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికుల వద్దకు వెళ్లి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురామిరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద రోజుకు 400 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. పిల్లల చదువుల కోసం పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళే వారికీ ఉపయోగకరంగా ఉంటుందన్నారు కార్మిక న్యాయం కింద ఆరోగ్య హక్కు చట్టం ద్వారా ప్రతి కార్మికునికి ఉచిత నిత్యవసర రోగ నిర్ధారణ పరీక్షలు మందులు మరియు ఆపరేషన్లతో కూడిన ఆరోగ్య రక్షణ కల్పించబడునని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఐదు న్యాయాలను తప్పక అమలు చేయడం జరుగుతుందని అన్నారు సమన్యాయం, రైతు న్యాయం, కార్మిక న్యాయం యువ న్యాయం, మహిళా న్యాయం, ఇలా అన్ని రకాల ప్రజలకు మేలు చేకూర్చే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డిగ్రీ పట్టా పొందిన వెంటనే 8500 జీతంతో ఒక సంవత్సరం ట్రైనింగ్ అల్లోవెన్స్ ప్రతి పేద ఇంటి ఇంటి పెద్ద మహిళా అకౌంట్ లో సంవత్సరం 1,00,000 వేయనున్నట్లు తెలిపారు రైతులకు msp చట్టం చేయుట దగ్గర్నించి గ్యారెంటీ లు అమలు చేస్తామని బ్యాలెట్ బాక్స్ మీద మూడో నెంబర్ ఎదురుగా ఉన్న హస్తం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు పాపులు, సీనియర్ నాయకులు మారం కరుణాకర్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్స్ ఉపాధ్యక్షులు కొంటెముక్కల్ నాగేశ్వర్ రావు, BH రబ్బానీ,  గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 9
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఖమ్మం డిసెంబర్ 6 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాధపాలెం మండలం మంగ్య తండా గ్రామపంచాయతీ సర్పంచ్ ఎలక్షన్ ఏకగ్రీవమైనది.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాలోతు భార్గవి...
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక
సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన తేజవత్ బద్రి
రాములు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ ఏకగ్రీవం.సర్పంచ్ గా బానోత్ వెంకట్రాం
ఏసీబీకి చిక్కిన పెద్ద వంగర తహశీల్దార్