‘దాహార్తి’ తీర్చే దాత ‘వాసవి మాఇల్లు’.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, ఏప్రిల్ 30, న్యూస్ ఇండియా : వేసవి వచ్చిందంటే చాలు మన్యంలోనే కాదు మైదాన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తాగునీటికి ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావని అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, ఐ.ఎ.ఎస్. గుర్తుచేశారు. ఈ సందర్బంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబి ముందు ‘వాసవి మాఇల్లు’ వారి చలివేంద్రం ను అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్, ఐ.ఎ.ఎస్. ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఐబీ వద్ద వేసవికాలం సందర్బంగా వాసవి మాఇల్లు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ను వ్యవస్థాపక అధ్యక్షులు ‘తోపాజి అనంతకిషన్’ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా అదనపు జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ వాసవి మాఇల్లు సేవలు అభినందనీయమని, ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి సేవలు మరిన్ని చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ డిఇ. ఇంతియాజ్, వాసవి మాఇల్లు సభ్యులు తోపాజి హరీష్, సంతోష్ గుప్త, మధుమోహన్, శ్రీహరి, సుధాకర్, కాంగ్రెస్ నాయకులు జార్జ్, కిరణ్ గౌడ్, కసిని రాజు తదితరులు పాల్గొన్నారు.
Comment List