విచారణ జరిగే ఉపాధ్యాయుడికి ప్రమోషన్ తో సత్కారం

అధికారానికి ఏది అడ్డు రాదని నిరూపించిన విద్యాశాఖ అధికారులు

విచారణ జరిగే ఉపాధ్యాయుడికి ప్రమోషన్ తో సత్కారం

విద్యార్థి చేత చీపిరితో స్కూల్ మొత్తం ఉడిపించిన ఉపాధ్యాయున్ని సమర్థించిన ఎంఈఓIMG-20240619-WA0114

ప్రభుత్వ అధికారులు పై అధికారుల అండదండలతో ఏమైనా చేయొచ్చని తొర్రూరు మండలంలోని ఒక పాఠశాలలో విద్యార్థిని స్వీపరుగా  మార్చిన వ్యవహారాన్ని పై అధికారి అసలు అబ్బాయి ఈ స్కూలు విద్యార్థి కాదు అని సమర్థించి పై అధికారులకు నివేదిక సమర్పించాగ పై అధికారులు వొత్తసు పలుకడం గమనార్హం. 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బ తండ ప్రభుత్వ బడిలో గత రెండు నెలల సెలవుల తర్వాత ప్రభుత్వ బడులు ఓపెన్ అయిన సందర్భంగా స్విపర్లు చేయవలసిన పనులు విద్యార్థి చేత ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు చేయించడాన్ని ప్రత్యక్షంగా జర్నలిస్టులు ఫోటోలు తీసి ఆధారాలతో సహా పేపర్లలో టీవీలలో ప్రచురించి జిల్లా కలెక్టర్ దృష్టి దాకా తీసుకెళ్లడం జరిగింది కానీ జిల్లా అధికారులు విచారణ పేరిట మండల విద్యాధికారులకు ఆదేశాలు పంపించగా మండల విద్యాధికారులు అసలు విద్యార్థి ఆ స్కూల్ వాడే కాదని వేరే అబ్బాయిని ఆ అబ్బాయికి స్కూల్ కు ఎలాంటి సంబంధం లేదని తప్పుడు నివేదికలు జిల్లా అధికారులకు పంపించడంతో అధికారులు తప్పు చేసిన ఉపాధ్యాయుడి కి ఇంకా ఉన్నత పదవి అప్పజెప్తూ ప్రమోషన్ పేరిట సత్కరించడం గమనార్హం. ఇలాంటి అధికారులు ఉన్నంతకాలం కిందిస్థాయి అధికారులు ఎలాంటి తప్పులు చేయడానికి అయినా వెనకాడరని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు. 

*పై అధికారుల కు సంఘటన జరిగిన పాఠశాలలో విచారణ జరిపి నివేదిక పందించడం జరిగింది.


 *పై అధికారుల కే తెలుసు నాకు ఎం సంబంధం లేదని చేతులు దులుపుకున్న ఎంఈఓ తొర్రూర్ రాములు*

Read More ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

మాకు జిల్లా అధికారుల నుండి ఆ పాఠశాలలో విచారణ జరిపి నివేదిక అందించామని చెప్పడంతో మేము జరిగిన విషయాన్ని తెలుసుకొని విచారణ జరిపి పంపించడం జరిగింది. ఆ ఉపాధ్యాయుడు పై ఏ చర్యలు తీసుకున్న పై అధికారులకే సంబంధం ఉంటుంది మాకు ఎలాంటి సంబంధం లేదని ఎంఈఓ రాములు తెలిపారు.

Read More జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’

తొర్రూరు మండల కేంద్రంలో వేసవి సెలవుల కంటే ముందు ఇలాంటి సంఘటనలే రెండు స్కూళ్లలో జరిగితే వాటిని కూడా ఫోటో ఆధారాలతో సహా ప్రచురించడం జరిగింది. వాటిపై కూడా ఎలాంటి స్పష్టత లేకుండా పై అధికారులు దాటవేయడం జరిగింది. ఎంతో కష్టపడి జర్నలిస్టులు ఆధారాలతో సహా సేకరించి వార్తా కథనాలు ప్రచురించినా కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని, విద్యార్థులకు గాని స్కూల్లో గాని ఎలాంటి న్యాయం జరగనప్పుడు ఇలాంటి వార్తలు సేకరించి ప్రచురించాల్సిన అవసరం ఏందని జర్నలిస్టు మిత్రులు చర్చించుకుంటున్నారు

Read More హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి

Views: 46
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి విద్యార్థులు క్రీడల్లో రాణించాలి
మహబూబాబాద్ జిల్లా:- విద్యార్థులు క్రీడల్లో రాణించాలి చదువుతోపాటు అన్ని రకాల ఆటల్లో పాల్గొని ఆరోగ్యంగా దేశం గర్వించదగ్గ పౌరులుగా ఎదగాలని సూచించిన జిల్లా పరిషత్ పాఠశాల పి...
ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’