డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

నాలుగో రోజు ఎలక్ట్రిసిటీ జట్టు విజయం

On
డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జి కృష్ణ

కొత్తగూడెం(న్యూస్ఇండియానరేష్)నవంబర్ 11: డాక్టర్ బి.ఎస్.రావు ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా విఐపి డిపార్ట్మెంటల్ క్రికెట్ టోర్నమెంట్ నాలుగో రోజు కొత్తగూడెం ప్రకాశం మైదానంలో సోమవారం మీడియా -1 జట్టు మరియు ఎలక్ట్రిసిటీ జట్టు మధ్య పోటీ నిర్వహించారు. తొలుత టాస్ గెలిచిన మీడియా-1 జట్టు బ్యాటింగ్ ఎంచుకొని, నిర్ణీత 20 ఓవర్లలో 165/7 పరుగులు చేసి,166 పరుగుల విజయ లక్ష్యాన్ని ఎలక్ట్రిసిటీ జట్టు ముందు ఉంచింది.అనంతరం బ్యాటింగ్ చేసిన ఎలక్ట్రిసిటీ జట్టు 19 ఓవర్లలో 166/5పరుగులు సాధించి విజయ బావుటా ఎగురవేసింది.మీడియా-1 జట్టు నుంచి సంసాన్ (39), రాజేష్ (38) ఇమ్రాన్ షేక్ (28) అత్యధిక పరుగులు చేశారు. ఎలక్ట్రిసిటీ జట్టు నుంచి జి.కృష్ణ (69),కృష్ణారావు(42)అత్యధిక పరుగులు అందించి జట్టు విజయానికి కృషి చేశారు.మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన జి.కృష్ణకు ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోచ్ సన్నీ శోబస్, జాన్సన్ డేవిడ్(బాబు),ఆర్గనైజర్ మడికంటి నవీన్,పెద్దపల్లి కిరణ్ చేతులమీదుగా అవార్డును అందుకున్నారు.ఎంపైర్లుగా పి.భార్గవ్,కిరణ్ వ్యవహరించారు.IMG20241111170541

Views: 238
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు... ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూ... భావితరాలకు ఆదర్శ ప్రాయంగా నిలుసూ... అహర్నిశలు శ్రమిస్తున్న కొల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి హృదయ...
జనగామ జిల్లా పాలకుర్తి మండలం దర్దేపల్లి గ్రామం లో
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు..
వృద్ధాశ్రమం కి చేయూత..
సరూర్నగర్ లో దారుణం..
జిల్లా విద్యాధికారి ‘ఆకస్మిక తనిఖీ’
హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి