రామభక్తిని చాటుకున్న శ్రీరామ భక్తులు
శ్రీరామ నవమికి పులిహోర, పానకం, మజ్జిగ పంపిణీ
పూర్ణ బుక్ స్టాల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా ప్రతినిధి)మార్చి 27 :శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పూర్ణ బుక్స్ స్టాల్, వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో శుక్రవారం పులిహోర, పానకం, మజ్జిగలను పంపిణీ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చల్లని మజ్జిగ, పానకం పంపిణీ చేయడం వల్ల భక్తులకు ఉపశమనం కలిగింది.కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉంది” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పూర్ణ బుక్స్ వాసుదేవ రావు, పెద్దిరాజు, రాము, ఏ.రాము,నరేష్, సురేష్, జగదీష్, జబ్బర్, మణికంఠ,శ్రీనివాస్,రాజేందర్,జంపన్న తదితరులు పాల్గొన్నారు.

Comment List