ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
On
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాలు..
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెట్, ఏప్రిల్ 06, న్యూస్ ఇండియా ప్రతినిధి:
అబ్దుల్లాపూర్‌మెట్ కూడలిలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి కార్యక్రమాన్ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుని, సమాజంలోని వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు మంగళి పల్లి మహేష్, గుండె రవీందర్, సంఘం అధ్యక్షులు గుండె రాజు, శివ, స్వామి, నరేష్, ప్రణయ్, భానుచందర్, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 21
About The Author
Post Comment
Latest News
22 May 2026 11:29:54
పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సబ్...

Comment List