వినూత్న రీతిలో వినాయక నిమజ్జనం

ఆటపాటలతో సాగిన గణనాథుని నిమజ్జనం

On
వినూత్న రీతిలో వినాయక నిమజ్జనం

IMG-20230925-WA0763   యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని చాడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఉత్సవాలను ముగింపు సందర్భంగా గణనాథుని నిమజ్జన కార్యక్రమం వినూత్న రీతిలో నిర్వహించారు. గణనాధుని వినూత్న రీతిలో అనగా జెసిబి యొక్క ముందు భాగంలో ఉండే డోజర్ లో విగ్నేశ్వరుని ప్రతిష్టించి నిమజ్జనం కార్యక్రమం సాగించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి మహిళలు సంప్రదాయ పద్ధతిలో దుస్తులు ధరించి కోలాటం ఆటలు, బతుకమ్మ పాటలు,డీజే చప్పుళ్ల మధ్య నృత్యాలు ఆనందోత్సాహాల మధ్య రంగురంగుల కలర్లు చల్లుకుంటూ డాన్సులు సాగించారు. యువకులు కేరింతలతో డీజే తీన్మార్ స్టెప్పులతో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించి ఆ గణనాధుని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో దేవళ్ళ పరశురాములు,హేమంత్, దేవల్ల వెంకన్న శ్రీకాంత్ ఉపేందర్ మురళి ఎలేందర్ అనిల్, ఆవనగంటి అనిల్ ,భూదేవి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 261
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
​పంట కోతల అనంతరం పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను తగలబెట్టడం చట్టరీత్యా నేరమని, అటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సబ్...
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి
పాత లింగాయిపల్లి లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు