కాంగ్రెస్ గ్యారంటీలు అద్భుతం పల్లె పల్లెనా బ్రహ్మరథం పడుతున్న మహిళలు, ప్రజలు : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

కాంగ్రెస్ గ్యారంటీలు అద్భుతం పల్లె పల్లెనా బ్రహ్మరథం పడుతున్న మహిళలు, ప్రజలు : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ

రిపోర్టర్ జైపాల్ ఉమ్మడి మెదక్ జిల్లా టేక్మాల్ మండలం అక్టోబర్ 16:

 ఇటీవల కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు మండలంలోని వివిధ గ్రామాల్లో దామోదర రాజనర్సింహ పర్యటించారు. ప్రజల వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను కచ్చితంగా నెరవేరుస్తామని తెలిపారు. అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల నుంచి బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షులు బక్క సిద్దు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ వార్డ్ నెంబర్లు పెంటయ్య, మల్లేశం, వీరితో పాటు వివిధ గ్రామాలకు చెందిన యువత, నాయకులు సుమారుగా 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నిమ్మరమేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వివిధ గ్రామాల అధ్యక్షులు మండల స్థాయి నాయకులు ఎన్ ఎస్ యు ఐ టేక్మాల్ మండల అధ్యక్షులు అడవయ్య మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Views: 55

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం