మద్య నిషేధం అసాధ్యమని టిడిపి అధ్యక్షులు అచ్చెన్న మాట్లాడటం హాస్యాస్పదం.! తెలుగుదేశం అసలు నైజం మరోసారి బయటపడింది.!! ఏపిసిసి సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు

By Khasim
On
మద్య నిషేధం అసాధ్యమని టిడిపి అధ్యక్షులు అచ్చెన్న మాట్లాడటం హాస్యాస్పదం.!  తెలుగుదేశం అసలు నైజం మరోసారి బయటపడింది.!!   ఏపిసిసి సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం-:

మధ్య నిషేదం అసాధ్యమన్న తెలుగుదేశం పార్టి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వాఖ్యలను ఏపిసిసి సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు.సోమవారం నాడు  కాంగ్రెస్ పార్టి కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం 2014 లో మద్య నియంత్రణ చేస్తామని హామీ ఇచ్చిందని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమే మరిచిపోయినట్లు నటిస్తుందని మండిపడ్డారు.2017 -18 లో రాష్ట్రంలో మహిళల ఆందోళన తర్వాత మహిళలు అనుమతించిన చోటే షాపులు తెరవాలని,వద్దన్న చోట షాపులు మూసివేయాలని ఆనాటి మంత్రివర్గ సమావేశం తీర్మానించిందని ఆ ఆందోళనలో పాల్గొన్న ప్రతిపక్ష నేత జగన్ మద్య నిషేధం హామీ ఇచ్చారని గుర్తు చేశారు.ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చెయ్యాలిసిన నేటి ప్రతిపక్ష హోదాలో ఉన్న తెలుగుదేశం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామనడం దుర్మార్గమైన చర్య.మహిళలపై,బాలలపై హింస,సమాజంలో హింస పెరగడంలో మద్యం ఓ ముఖ్య కారణమని గుర్తించడానికి నిరాకరిస్తూ వ్యాపార ప్రయోజనాలను మాత్రమే కాపాడే పద్ధతిలో మాట్లాడడం తెలుగుదేశం అధ్యక్షులు అచ్చెన్న కు తగదని హితవు పలికారు.మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాన్ని నడుపుకోవాలన్న యావ తప్ప పేద ప్రజల సంక్షేమం,మహిళల సంక్షేమం పట్టదా? మద్యం షాపులు ఉండరాదని బాధలు పడుతున్న మహిళలు డిమాండ్ ను పరిగణన లోకి తీసుకోరా?తాగుడుకు బానసలు అయిన వారు కూడా మద్యం షాపులు అందుబాటులో లేకపోతే  తాగకుండా ఉంటామని మద్యం అందుబాటులో ఉండకూడదని కోరుకుంటున్న వాళ్ల సంఖ్యే ఎక్కువ గా ఉంది.కోవిడ్ సమయంలో మూడు నెలలు మద్యం లేని సమయంలో మెజారిటీ పేద ప్రజలు మద్యం మానేశారు.కుటుంబాలు హాయిగా ఉన్నాయని మహిళలు సంతృప్తి చెందారని నివేదికలు తెలుపుతున్నాయని అన్నారు.అధికారంలో ఉన్న వైసిపి అండదండలతో కొద్దిమంది మాత్రమే మద్యం,సారాయి అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకోవడానికి సరఫరా చేస్తున్నారని ఏ ప్రభుత్వమైనా చిత్తశుద్ధితో నిషేదం అమలు చేస్తే మద్యం తాగడాన్ని కనీస స్థాయికి తీసుకురావడం సాధ్యమేనని అనేక రాష్ట్రాల అనుభవాలు తెలియచేస్తున్నాయని అన్నారు.సామాజిక సంస్కృతిలో భాగంగానే కొన్ని రాష్ట్రాలలో మద్యం వాడకం కనీస స్థాయిలో ఉందని నివేదికలు తెలుపుతున్నాయి.తెలుగు రాష్ట్రాలలో పాలక పార్టీలు పోటీపడి లాభాపేక్షతో వీధి వీధికి,ఇంటింటికీ మద్యం సరఫరా చేస్తూ భారీగా లాభాలు అర్జిస్తున్నారని విచ్చల విడిగా మద్యం,గంజాయి లాంటి మత్తు మందుల ఫలితంగా అత్యాచారాలు,హత్యలు నేరాలు పెరుగుతూ కుటుంబాల వినాశనానికి కారణం అవుతున్నాయని ఆవేదన వ్యక్తపరిచారు.ఆనాటి మహిళలు,మేధావులు,ప్రజలుప్రతిపక్ష పార్టీలు ఉద్యమానికి స్పందించి ఎన్టీఆర్ ఇచ్చిన మద్య నిషేధం హామీ అమలును తుంగలో తొక్కిన మీరు ఆయనకి పూలదండలు వేయడం విషాదకరం ఇప్పటికైనా అధికార వైసిపి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మహిళలు,ప్రజాసంఘాలు ఇండియా కూటమి కోరుతున్నారు.ప్రతిపక్షంలో ఉన్న టిడిపి మహిళలలు ప్రజల మద్దతు పొందాలంటే గతంలో మీ పార్టీ చేసిన వాగ్దానాలను అమలు చేసేందుకు పూనుకుంటామన్న స్పష్టమైన నిర్ణయంతో ముందుకు రావలసిన అవసరం ఉందన్నారు.తెలుగుదేశం నాయకుడిగా ఉన్న అచ్చం నాయుడు ప్రకటనను ఉపసంహరించుకొని ఎన్టీఆర్ అమలు చేసిన మద్య నిషేనాన్ని అమలు చేయడానికి పూనుకొని మద్యం తయారిని,వ్యాపారాన్ని అరికట్టేందుకు సిద్ధం కావాలని హితవు పలికారు.అలాగే ఇటీవల మద్యం స్ధానంలో విచ్చలవిడిగా వచ్చిన గంజాయిని అరికట్టాలని కాంగ్రెస్ పార్టి పక్షాణ ఆయన డిమాండ్ చేశారు.IMG-20231120-WA0630

Views: 8
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

పాయకరావుపేటలో ఎవరు? పాయకరావుపేటలో ఎవరు?
వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ వేటు పాయకరావుపేటలో గొల్ల బాబూరావుకు నో ఛాన్స్ ఏపీ మాల కార్పొరేషన్ చైర్ పర్సన్ అమ్మాజీకి ఛాన్స్
తెలంగాణలో సీఎం ఎవరు అని
ఉత్తమ యువ రాజకీయ విశ్లేషకుడిగా
డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
ఘనంగా హోంగార్డ్స్ రేజింగ్ డే వేడుకలు
మహా నగరంలో కల్తీ మాయగాళ్ళు
కంగ్టి లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు