నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఓటు పై అవగాహన

On
నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఓటు పై అవగాహన

*నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఓటు పై అవగాహన*

 *కొత్తగూడెం జిల్లా* *నెహ్రూ యువ కేంద్ర* ఆధ్వర్యంలో,  జిల్లా యువ అధికారి అన్వేష్ చింతల, అకౌంట్స్ మరియు ప్రోగ్రామ్ అధికారి కమరతపు భానుచందర్ వారి ఆదేశాల  మేరకు పువ్వాడ నగర్ జాగృతి యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ షారుక్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో  ఓటు పై అవగాహన కార్యక్రమాన్ని మణుగూరు ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మణుగూరు యు సి డి ఆఫీసర్ కృష్ణ పాల్గొని వారు మాట్లాడుతూ 18సం,, నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటర్ నమోదుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్లో యాప్ ద్వారా, ఓటరు గైడ్ సర్చ్ యువర్ నేమ్, ఇన్ ద ఓటర్ లిస్ట్, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ లో ఫారం 6 బి,  ఫారం 8, ఫారం 7, గురించి వివరించి ఆన్లైన్ ద్వారానే మీ ఓటు అప్లై చేసుకోవచ్చని మరియు తమ ఓటుని దుర్వినియోగం చేసుకోకుండా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం ఓటు ప్రతిజ్ఞ చేసి ఓటు అవేర్నెస్ పోస్టర్ను ప్రారంభించి మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ బి శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ అనిల్ కుమార్,  డబ్ల్యూ ఈ సి కోఆర్డినేటర్ డాక్టర్ అనురాధ, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సహకరించిన కళాశాల యజమాన్యానికి జాగృతి యూత్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు.IMG-20240312-WA0424

Views: 60
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News