పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ప్రజలు చరిత్రను తిరగరాయనున్నారు.
ఎంపీ వద్దిరాజు ఖమ్మం తెలంగాణ భవన్ లో..
నామా నాగేశ్వరరావు కి ఖమ్మం నియోజవర్గంలోనే అత్యధిక మెజార్టీ రానుంది.
బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకే ప్రజా ఆదరణ ఇప్పటికే సర్వే ఫలితాలు తేల్చాయి..*
*నామా నాగేశ్వరరావు గారి విజయం కోసం ప్రతి బూత్ లెవల్ కమిటీ సభ్యుడు గడపగడపకు వెళ్లి ఓట్లను అభ్యర్థించాలి..*
*అసెంబ్లీ ఎన్నికలు అయిన అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత..*
*ఖమ్మం జిల్లా ప్రయోజనాల కోసం తనదైన స్థాయిలో పార్లమెంట్ వేదికగా కృషిచేసిన మహోన్నతమైన వ్యక్తి మన నామా నాగేశ్వరరావు..*
ఖమ్మం కార్పొరేషన్ వన్ టౌన్ & 3 టౌన్ బిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ కమిటీ సభ్యులతో *ఖమ్మం జిల్లా BRS పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ నందు నగర పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, MLC & ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్, గార్లు మాట్లాడుతూ:* బూత్ కమిటీ సభ్యులకు డివిజన్ నాయకులకు, కార్యకర్తలకు బిఆర్ఎస్ పార్టీ విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ విషయాలను దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఖమ్మం నగర మేయర్ నీరజ, సీనియర్ నాయకులు RJC కృష్ణ, వన్ టౌన్ & 3 టౌన్ కార్పొరేటర్లు మరియు డివిజన్ అధ్యక్షులు, కార్యదర్శులు, బూతులు కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List