ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ కారేపల్లి రోడ్ షోలో
*రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర బీఆర్ఎస్ ఖమ్మం లోకసభ నియోజకవర్గ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్, పార్టీ సీనియర్ నాయకులు ఆర్జేసీ కృష్ణ,కూరాకుల నాగభూషణంలతో కలిసి కారేపల్లి రోడ్ షోకు ముఖ్య అతిథిగా హాజరు*
*వైరా నియోజకవర్గం కారేపల్లి (సింగరేణి) అంబేడ్కర్ చౌరస్తాలో మంగళవారం రాత్రి గులాబీ శ్రేణులు, అభిమానులు, స్థానికులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గుమిగూడారు*
*ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ*
👉 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ మాయమాటలు చెప్పి తమను మోసగించిందని ప్రజలు ఆ తర్వాత గుర్తించారు
👉రైతుబంధును 15వేలకు, పింఛన్లను 4వేలకు పెంచుతామని, కళ్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు
👉 అలవికాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై ప్రజలు కసి తీర్చుకునేందుకు లోకసభ ఎన్నికల పేరిట మంచి అవకాశం వచ్చింది
👉ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
👉వాళ్లిచ్చిన వాగ్ధానాలను నిలదీసి అమలు చేయించుకునేందుకు మన అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకుందాం
👉 రాష్ట్రంలోని 17సీట్లలో 12 ఎంపీలను మనం గెలిపించుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నది
👉 కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే మన నామ మంత్రి అవుతారు, ఖమ్మం మరింత గొప్పగా అభివృద్ధి చెందుతది
👉 కేసీఆర్ గారి బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనను చూసి ఓర్వలేక కాంగ్రెస్ -బీజేపీలు కుమ్మక్కై 48గంటల పాటు ప్రచారాన్ని నిలిపివేశారు
👉ఈ కుట్రను ప్రజలు గమనించారు,అర్థం చేసుకున్నారు
👉 రాష్ట్ర మంత్రివర్గంలో ముస్లిం, ముదిరాజ్,మున్నూరుకాపు,యాదవ, పద్మశాలిలకు ప్రాతినిథ్యం లేదు
👉ఖమ్మం డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం యాదవ్ ను కుట్ర పన్ని పదవి నుంచి దింపేశారు
👉 కాంగ్రెస్ బీసీకి తీవ్ర అన్యాయం చేస్తే, వెనుకబడిన వర్గానికి చెందిన తనకు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారం రాజ్యసభకు తిరిగి పంపడం జరిగింది
👉మన అభ్యర్థి నామ నాగేశ్వరరావు స్థానికులు
👉 ప్రతినిత్యం ప్రజల మధ్యన ఉంటారు
👉 తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల సాధనకు పార్లమెంటులో కొట్లాడినది,కొట్లాడేది బీఆర్ఎస్ మాత్రమే
👉మన అభ్యర్థి నామ తన తండ్రి ముత్తయ్య పేరిట ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు
👉కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నారు
👉 బంగారం లాంటి నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది
*ఈ సందర్భంగా "జై తెలంగాణ జైజై","తెలంగాణ వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి", "జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్"," కారు గుర్తుకే మన ఓటు మన ఓటు"," బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావును భారీ ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం" అనే నినాదాలతో కారేపల్లి దద్దరిల్లింది.
Comment List