డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
అక్రమ కట్టడాలు కట్టి దారిని కబ్జా చేసిన వారిని త్వరలో పై అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం*
డిబిఎం 59 కెనాల్ కాల్వ ఎంతవరకు ఉందో రెండు వైపులా దారిని పూర్తిచేస్తాం త్వరలో హద్దులు కూడా నిర్మిస్తాం.*శ్రీనివాస్ రావు, ఇరిగేషన్ ఏఈ*8 గుంటలు ఆక్రమించారు వినోద్ కుమార్, ఎమ్మార్వో, తొర్రూరు*
డిబిఎం 59 కేనాల్ కాల్వ దారి నాది... ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి కథనానికి స్పందించిన ఇరిగేషన్ అధికారులు*
*అక్రమ కట్టడాలు కట్టి దారిని కబ్జా చేసిన వారిని త్వరలో పై అధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం*
*డిబిఎం 59 కెనాల్ కాల్వ ఎంతవరకు ఉందో రెండు వైపులా దారిని పూర్తిచేస్తాం త్వరలో హద్దులు కూడా నిర్మిస్తాం.*
*శ్రీనివాస్ రావు, ఇరిగేషన్ ఏఈ*
*8 గుంటలు ఆక్రమించారు వినోద్ కుమార్, ఎమ్మార్వో, తొర్రూరు*
(న్యూస్ ఇండియా తెలుగు మే 20 మహబూబాబాద్ జిల్లా స్టాప్ రిపోర్టర్ డి వీరాంజనేయులు)
డీపీఎం 59 కెనాల్ కాల్వ పై అక్రమ తవ్వకాలు కబ్జాలు అనే శీర్షిక ఆదివారం న్యూస్ ఇండియా దినపత్రికలో ప్రచురించిన కథనానికి ఇరిగేషన్ అధికారులు స్పందించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం ఎలుకట్టే గ్రామ శివారులోని పిఎస్ఆర్ పాఠశాల యాజమాన్యం అక్రమంగా డీపీఎం 59 కెనాల్ కాల్వ పై అక్రమ కట్టడాలు చేపట్టడం నిజమేనని ఇరిగేషన్ అధికారులు మరియు రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. సోమవారం డీపీఎం 59 కెనాల్ కాలువను ఇరిగేషన్ అధికారులు సందర్శించే సమయంలో కాలువ వద్దకు రైతులు ముక్కుముడిగా రావడంతో అధికారులకు close రైతులకు ఘర్షణ మొదలైంది.
డీపీఎం 59 కెనాల్ కాలువ పీఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం అక్రమంగా కట్టడాలు నిర్మించడం నిజమే. కానీ కోర్టులో కేసు నడుస్తోంది. జూన్ 16న హియరింగ్ ఉండడం వలన మేము అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి వెనుకాడుతున్నాము. అదేవిధంగా ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేయడం తో పాటు డీపీఎం 59 కెనాల్ కాల్వకు ఇరువైపులా హద్దులు నిర్మించి రైతులకు మేలు చేస్తాం. పట్టణ కేంద్రంలోని బృందావనం దాబా నుండి పాల కేంద్రం వద్ద పెద్దవంగర రోడ్డు వరకు సుమోరుగా 1 కిలోమీటర్ 235 మీటర్లు పొడవు ఇరువైపులా హద్దులు నిర్మించి ఎవరు కూడా కెనాల్ కాల్వను కబ్జాకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటాం. కాల్వకు ఒక్క వైపు 33 మీటర్లు మరొకవైపు 44 మీటర్లు ఉండాలి. కానీ 33 మీటర్లు ఉన్న కాల్వపై పిఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం అక్రమ కట్టడాలు నిర్మించింది వాస్తవమే త్వరలోనే అక్రమ కట్టడాలను కూల్చివేయడం జరుగుతుందని తదుపరి
హద్దులు నిర్మిస్తామని ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్ రావు తెలిపారు.
పీఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం డీపీఎం 59 కాలువ పై సుమారుగా 8 గుంటల స్థలం ఆక్రమించుకొని ఈ స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మేము జూన్ 16న సబ్మిట్ చేయాల్సిన వివరాలు అందుబాటులో ఉంచుకున్నాం. మొత్తానికి ఎనిమిది గుంటల నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి స్థలంను స్వాధీనం చేసుకొని రైతులకు వీలుగా ఉండే విధంగా పనులు చేపడతామని తొర్రూర్ తాసిల్దారు వినోద్ కుమార్ తెలిపారు.
Comment List