టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయండి

ఎన్నికల ఇన్చార్జి మంత్రి కొండ సురేఖ 

On
టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయండి

పొత్తులకు ఆహ్వానిస్తున్నాం 

IMG20260201205449కొత్తగూడెం(న్యూస్ఇండియా)ఫిబ్రవరి 1: కొత్తగూడెం కార్పొరేషన్ 60 డివిజన్లకు సంబంధించి టికెట్ ఎవరికైనా గెలుపు కోసం కృషి చేయాలని జిల్లా ఎన్నికల ఇన్చార్జి అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదివారం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో అన్నారు. జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న అధ్యక్షతనలో  జరిగిన ఈ సమావేశంలో ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి,మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి నిర్ణయం మేరకే అభ్యర్థులను ఖరారు చేస్తారని, గత కొద్దిరోజుల నుంచి డివిజన్ల వారీగా టీములు  సర్వే నిర్వహిస్తున్నామని, సర్వే ఆధారంగానే అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు. అంతేకానీ స్వలాభం కానీ, స్వార్థంతో కానీ  సొంత నిర్ణయాలతో  అభ్యర్థుల ఎంపిక చేయడం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క అభ్యర్థి అంగు ఆర్భాటలు ప్లెక్సీలు కాకుండా ప్రతి ఇంటి గడప గడప కు వెళ్లి ఓటును అభ్యర్థించాలని అన్నారు. పొత్తులకు ఆహ్వానిస్తున్నాం కానీ ఎవరు ముందుకు రావడంలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో  జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Views: 232
Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్.. అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన సర్పంచ్..
అస్మాతపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం.. రంగారెడ్డి జిల్లా, మంచాల, మార్చి 07, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఇందిరమ్మ ఇల్లును ప్రారంభిస్తున్న సర్పంచ్ మంథని శివ యాదవ్.. ఇబ్రహీంపట్నం...
వరంగల్ ప్రభుత్వ MGM హాస్పిటల్ లో దారుణం .సమస్యలకు నిలయంగా దవాఖాన
ప్రకాష్ నగర్ లో సందడి సందడిగా హోలీ రంగోలి
రేపటి భవిష్యత్తు వినూత్నంగా ఆలోచించే విద్యార్థులదే
జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ 
పార్లమెంట్ సభ్యులుగా మారిన డిగ్రీ మహిళ విద్యార్థులు
చంద్రగ్రహణం సందర్భంగా రేపు పెద్దమ్మ గుడి మూసివేత