మున్సిపాలిటీ బరిలో పచ్చిపాల నాగలక్ష్మి
కౌన్సిలర్ గా అవకాశం ఇవ్వాలని దరఖాస్తు
డోర్నకల్ : యువత రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపు మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ప్రజలకు సేవ చేసేందుకు డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో 11 వార్డ్ కౌన్సిలర్ గా నుండి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని పచ్చిపాల గోపి సతీమణి విద్యావంతురాలు అయినా పచ్చిపాల నాగలక్ష్మి దరఖాస్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఇస్తే రాబోయే ఎన్నికల్లో పార్టీ పెద్దల ఆశిస్సుల భారీ మెజారిటీతో గెలిచి మున్సిపాలిటీలో ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే యువతకు ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలు గుర్తు చేసిన 11వ వార్డు కౌన్సిలర్ గా టికెట్ కేటాయించాలని కోరారు.

Comment List