త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆర్రైవ్, అలైవ్
ప్రమాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివురావు
కొత్తగూడెం(న్యూస్ ఇండియా జిల్లా ప్రతినిధి)జనవరి 22: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా డీజీపీ, ఐజి,ఎస్పీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఆర్రైవ్, అలైవ్ కార్యక్రమాన్ని త్రీ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో కొత్తగూడెం రైతు బజార్ వద్ద గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివురావు,డిఎస్పి అబ్దుల్ రెహమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, డీఎస్పీ మాట్లాడుతూ.. ప్రమాద రహిత రాష్ట్రంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంగా కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు . వ్యాధుల వలన మరణాల చాలా తకున్నావా ఉన్నాయని, రోడ్డు ప్రమాదం వల్లనే మరణాల సంఖ్యపెరిగాయి అని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడప వద్దని, ప్రమాదవశత్తు వ్యక్తి మరణిస్తే వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతుందని, ప్రమాదంలో ఎవరైనా గాయపడితే వారిని హాస్పిటల్ కు తరలించిన వారికి కేంద్ర ప్రభుత్వం 25 వేల రూపాయలు వారికి అందిస్తుంది అన్నారు. స్వయంకృత అపరాధమువలనే ప్రమాదం ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రతి ఒక వాహనదారుడు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో త్రీ టౌన్ సిఐ శివ ప్రసాద్, టూ టౌన్ సీఐ ప్రతాప్, ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్, ఎస్సైలు రమణారెడ్డి,విజయ కుమారి, రాకేష్, ట్రాఫిక్ ఏఎస్ఐ రఫీ హైమద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Comment List