సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

On
సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

సర్వీస్ రోడ్లపై పండ్ల బండ్లను తొలగించాలి..

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ జనవరి 25, న్యూస్ ఇండియా ప్రతినిధి:

IMG_20260125_10584170
సర్వీస్ రోడ్లపై పండ్ల పనులను తొలగించాలి : కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి..

హయత్‌ నగర్ ఆటోనగర్ పరిసరాల్లో జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న సర్వీస్ రోడ్లపై అక్రమంగా పండ్ల బండ్లు ఏర్పాటు చేయడంపై కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో వచ్చి రోడ్లను ఆక్రమించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా రాకపోకలకు ఆటంకం కలుగుతూ ప్రమాదాల ముప్పు పెరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ట్రాఫిక్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, సర్వీస్ రోడ్లపై అక్రమంగా ఏర్పాటు చేసిన పండ్ల బండ్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సర్వీస్ రోడ్లు వాహనదారుల భద్రత కోసమేనని, వాటిని ఆక్రమించడం సహించబోమని ఆయన హెచ్చరించారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలపై అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని కార్పొరేటర్ కోరారు.

Read More అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు..

Views: 9

About The Author

Post Comment

Comment List

Latest News