మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో ఘనంగా పరాక్రమ్ దివాస్
మై భారత్ ఖమ్మం ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ అన్వేష్ చింతల గారి ఆదేశాల మేరకు అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కమరతపు భానుచందర్ గారి సహకారంతో పువ్వాడ నగర్ జాగృతి అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ షారూక్ ఇమ్రాన్ మరియు శ్రీ సాయి గణేష యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కడారి ఉష పరాక్రమ్ దివాస్ నీ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల లో నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి చిత్రపటానికి పూలమాల వేసి పరాక్రమ్ దివాస్ గురించి వ్యాసరచన పోటీ మరియు ఉపన్యాస పోటీని నిర్వహించి అందులో గెలుపొందిన యువతకు మొదట మరియు ద్వితీయ బహుమతిని అందజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటడం ర్యాలీ తీయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమమును గురించి కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి అనురాధ మరియు వైస్ ప్రిన్సిపల్, సునీత, అంజలి, పీడి శ్వేత, నాగేశ్వరరావు గారు అవగాహన కల్పించారు ఇందుకు సహకరించినందుకు కళాశాల వారికి మేర యువ భారత్ వారు కృతజ్ఞతలు తెలియజేశారు

Comment List