మేడారానికి 25 నుంచి ప్రత్యేక బస్సులు
కొత్తగూడెం నుండి 110, ఇల్లందు నుండి 41బస్సులు
డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి
కొత్తగూడెం (న్యూస్ ఇండియా) జనవరి 21:ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈనెల 28వ తేదీ నుండి జరుగుతున్న నేపథ్యంలో జాతరకు వెళ్లే భక్తుల కొరకు కొత్తగూడెం డిపో అన్ని ఏర్పాట్లతో సిద్ధమైందని కొత్తగూడెం డిపో మేనేజర్ యు. రాజ్యలక్ష్మి తెలిపారు.కొత్తగూడెం డిపో నుండి 110 బస్సులు మరియు ఇల్లందు డిపో నుండి 41 బస్సులు ఆపరేట్ చేయుటకు ప్రణాళికలు సిద్ధమైనవని ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా22తేదీ గురువారం నుండి ఉదయం 7 గం,, మరియు 8 గ,, రెండు సర్వీసులను వయా మణుగూరు, ఏటూరు నాగారం ద్వారా మేడారంకు నడపబడునని తెలిపారు. కావున భక్తులు ఆర్టీసీ బస్సులలో సురక్షితంగా ప్రయాణం చేస్తూ అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లే అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి చార్జీల వివరములు కొత్తగూడెం బస్టాండ్ నుంచి పెద్దలకు 350 రూపాయలుగా మరియు పిల్లలకు 190 రూపాయలుగా నిర్ణయించడమైందని తెలిపారు.మహా జాతరకు ఈనెల 25వ తేదీ నుండి అనగా ఆదివారం నుండి ప్రత్యేకమైన సర్వీసులు అందుబాటులో ఉంటాయని కావున జాతరకు వెళ్ళు భక్తులు గమనించగలరని తెలిపారు. మహా జాతరకు వివిధ కారణాల ద్వారా వెళ్లలేని భక్తులు అమ్మ వార్ల ప్రసాదాన్ని టీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ కొత్తగూడెం కౌంటర్ నందు మరియు నేరుగా లాజిస్టిక్స్ ఆన్లైన్ నందు కేవలం 299 రూపాయలు చెల్లించి బుక్ చేసుకొని ఇంటి వద్దనే ప్రసాదాన్ని పొందే అవకాశం కలదని తెలిపారు. ఈ ప్రసాదం ఐనా బంగారంతో పాటు అమ్మవార్ల ఫోటో మరియు పసుపు కుంకుమలు కూడా అందజేస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను కొత్తగూడెం డిపో మేనేజర్ కార్యాలయంలో సిబ్బంది తో కలసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిపో సూపరిండెంట్ విజయలక్ష్మి, సూపరిండెంట్ (ఫైనాన్స్) సాహిక మరియు ట్రాఫిక్ సూపర్వైజర్ విజయలక్ష్మి, జహీర్ మరియు లాజిస్టిక్స్ మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Comment List