విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో  పాడి గేదలు మృతి 

ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న విద్యుత్ శాఖ ఏఈ మరియు విద్యుత్ అధికారులు

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో  పాడి గేదలు మృతి 

కిందిస్థాయి ఉద్యోగులచే మొత్తం పనులు చేయిస్తూ బయట వ్యవహారాలు చూసుకుంటున్న జూనియర్ లైన్మెన్లు, లైన్మెన్లు , లైన్ ఇన్స్పెక్టర్.


విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పాడే గేదలు మృతి చెందిన సంఘటన నాంచారి మడూరు గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది 
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మడూరు గ్రామంలో బంగారి సోమయ్య అనే రైతు పాడి గేదెలు ఉదయాన్నే మేత కోసం వదిలేసిన క్రమంలో కొద్దిసేపట్లోనే కరెంటు ఎన్టీ లైన్ వైరు తెగి పొలాలలో పడినది అది గమనించని రైతు పాడి గేదెలు మేతకై వెళ్లి వైర్లను తాకి వెంటనే మృతి చెందాయి. అవే జీవనాధారంగా బ్రతుకుతున్న రైతు బోరున విలపించాడు తాను జీవనాధారం అయినటువంటి గేదెలు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఈరోజు నా గేదెలు మృతి చెందాయని నడి పొలంలో కరెంటు స్తంభం జెసిబి తాకి వంగి పోతే దాన్ని రిపేరు చేయమని ఎన్నోసార్లు  మొరపెట్టుకున్నా కూడా సంవత్సరం గడుస్తున్న లైన్ రిపేరు చేయకుండా కాలం వెళ్లపుచ్చుకుంటూ వచ్చినారు. ఈరోజు మడూరు గ్రామంలో దుర్గమ్మ పండుగ సందర్భంగా ఎంతోమంది గ్రామానికి చుట్టపు చూపుగా వచ్చి ఉన్నారు పొరపాటున ఎవరైనా అటు వెళ్లిన నా గేదెలకు పట్టిన పరిస్థితి పట్టును కదా అని ఆవేదన చెందాడు ఇంత జరుగుతున్నా ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా లైన్మెన్ గాని లైన్ ఇన్స్పెక్టర్ గాని ఏఈ గాని తమకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని రైతు ఆవేదన చెందాడు 
నాకు జీవనాధారం అయినటువంటి గేదెలు మృతి చెందడంతో నా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది గేదపాలు అమ్ముకొని బ్రతికే మాకు  జరిగిన నష్టానికి న్యాయం చేయగలరని పై అధికారులను, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము..

Views: 65
Tags:

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే