*దేశ వ్యాప్తంగా జూలై 1వ తేది నుండి అమలు కానున్న నూతన చట్టాలు.. *నూతన చట్టాలపై యస్.హెచ్.ఒ. లకు ఒక రోజు శిక్షణ తరగతులు.. *ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలి..

జిల్లా ఎస్పీ శ్రీ చెన్నూరి రూపేష్ ఐ.పి.యస్.

On
*దేశ వ్యాప్తంగా జూలై 1వ తేది నుండి అమలు కానున్న నూతన చట్టాలు.. *నూతన చట్టాలపై యస్.హెచ్.ఒ. లకు ఒక రోజు శిక్షణ తరగతులు..   *ప్రతి ఒక్క పోలీసు అధికారి కొత్త చట్టాల గురించి అవగాహన కలిగి, పూర్తి స్థాయిలో సిద్దంగా ఉండాలి..

జూన్ 20, సంగారెడ్డి జిల్లా, న్యూస్ ఇండియా: ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం నందు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు హాజరైన జిల్లా పోలీసు అధికారులను ఉధ్యేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. జూలై 1వ తేది నుండి దేశవ్యాప్తంగా కొత్త చట్టాలను అమలు చేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకు అనుగుణంగా జూలై 1వ తేది నుండి కొత్త చట్టాలను అనుసరిస్తూ ముందుకు సాగాల్సి ఉంటుందన్నారు. కొత్త చట్టాలైన (1) భారతీయ న్యాయ సంహిత, (2) భారతీయ నాగరిక్ సురక్ష సంహిత మరియు (3) భారతీయ సాక్ష్యా అధినియం-2023. వీటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నపుడే సమర్ధవంతంగా విధులు నిర్వహించగలం అని, కొత్త చట్టాలపై అవగాహణ రావాలంటే నేర్చుకోవాలనే తపన మనలో ఉన్నప్పుడే సాద్యం అవుతుందన్నారు. కొత్త చట్టాల అమలు జరిగిన వెంటనే ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరం అని, అప్పుడే బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, అరెస్ట్, వాంగ్మూలం నమోదు నందు పాటించవలసిన జాగ్రత్తలు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయడంలో దర్యాప్తు అధికారులు వ్యవహరించవలసిన తీరు తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పుల గురించి వివరించారు. అనంతరం అదనపు ఎస్పీ. ఎ. సంజీవ రావ్ మాట్లాడుతూ.. భారతన్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలుగా ఉంటుందన్నారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కొరూ కొత్త చట్టాలను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డియస్పి రామ్ మోహన్ రెడ్డి, నారాయణఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, యస్.బి ఇన్స్పెక్టర్స్ శివలింగం, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, యస్.హెచ్.ఒ.లు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-06-20 at 3.41.43 PM

Views: 30
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News