ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

On
ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయత భావం పెంపొందాలి..

IMG-20240815-WA0822
జాతీయ జెండాను ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం ఎస్.హెచ్.ఓ సత్యనారాయణ..

ఘనంగా జాతీయ పతాకాల పంపిణీ..

స్ఫూర్తి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

ఇబ్రహీంపట్నం, ఆగస్ట్ 15 (న్యూస్ ఇండియా ప్రతినిధి): ఇబ్రహీంపట్నం నియోజవర్గ కేంద్రంలోని ఇబ్రహీంపట్నం గ్రంథాలయం ఎదురుగా స్ఫూర్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన జాతీయ పతాకాన్ని ఇబ్రహీంపట్నం సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆవిష్కరణ చేశారు.  ఈ సందర్భంగా స్ఫూర్తి యూత్ ఇన్చార్జి సూరమోని బాబు మాట్లాడుతూ.. తమ స్ఫూర్తి యూత్ అసోసియేషన్  గత 24 సంవత్సరాలుగా ఇబ్రహీంపట్నంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని, ప్రత్యేకంగా ప్రతి సంత్సరం స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవాలను జరపటమే కాకుండా ఈ పండగ రోజు ప్రతి ఒక్కరు జాతీయ పతాకం ధరించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి జాతీయ పతాకాల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరిలో  జాతీయత భావాలు, దేశభక్తి పెంపొందించడమే యూత్ లక్ష్యమని, దేశంలోని ప్రజలందరూ స్వాతంత్ర దినోత్సవాన్ని అమరుల త్యాగాలను స్మరించుకుంటూ పండగల  జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి యూత్ నాయకులు దానం సాయికుమార్, బుద్ధి దీపక్, వినయ్, వెంకటేష్, ఎస్ యాదగిరి, శివారెడ్డి, జె.సాయి రెడ్డి, మధుకర్, భాస్కర్ స్ఫూర్తి యూత్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu

Views: 25

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే