చాలా కాస్ట్ లీ గురూ!

On

భార‌త ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో అత్యంత భారీ ధ‌న‌వ్య‌యం కాగ‌ల ఉప ఎన్నిక‌గా నిలుస్తోంది మునుగోడు బైపోల్. మూడు పార్టీలు ప్ర‌ధానంగాపోటీ చేస్తూ.. వాటిల్లో విజ‌యాన్ని రెండు పార్టీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో… నోట్లు క‌ట్ట‌లు తెంచుకుంటున్నాయి. మునుగోడులో ఓటుకు పంచే డ‌బ్బు అత్యంత భారీ స్థాయిలో ఉండ‌బోతోందని స్ప‌ష్టం అవుతోంది. స్థానిక ప‌రిస్థితుల ప్ర‌కారం చూస్తే.. ఒక్కో ఓటుకు ఒక్కో రాజ‌కీయ పార్టీ ప‌ది వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల క్యాష్ ను పంపిణీ చేయ‌వ‌చ్చ‌ని […]

భార‌త ప్ర‌జాస్వామ్య చ‌రిత్ర‌లో అత్యంత భారీ ధ‌న‌వ్య‌యం కాగ‌ల ఉప ఎన్నిక‌గా నిలుస్తోంది మునుగోడు బైపోల్. మూడు పార్టీలు ప్ర‌ధానంగాపోటీ చేస్తూ.. వాటిల్లో విజ‌యాన్ని రెండు పార్టీలు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న నేప‌థ్యంలో… నోట్లు క‌ట్ట‌లు తెంచుకుంటున్నాయి.

మునుగోడులో ఓటుకు పంచే డ‌బ్బు అత్యంత భారీ స్థాయిలో ఉండ‌బోతోందని స్ప‌ష్టం అవుతోంది.

స్థానిక ప‌రిస్థితుల ప్ర‌కారం చూస్తే.. ఒక్కో ఓటుకు ఒక్కో రాజ‌కీయ పార్టీ ప‌ది వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల క్యాష్ ను పంపిణీ చేయ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఓటుకు వందో, వెయ్యో అనేది పాత లెక్క‌.

ఈ ఉప ఎన్నిక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో.. ఓటు రేటు ప‌ది వేలు, 15 వేల రూపాయ‌ల వ‌ర‌కూ ప‌ల‌క‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు పంపిణీకి ప్ర‌ధాన పార్టీలు రెడీ అవుతున్నాయి.

Read More తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే

ఇందుకోసం ఓటుకు నోటు పంచ‌గ‌ల స‌మ‌ర్థుల ను కూడా వెదికే ప‌నిలో ప‌డ్డాయి పార్టీలు. ఎంత విచ్చ‌ల‌విడిగా డ‌బ్బును చిల్లాడినా.. డ‌బ్బును మాత్రం గుట్టుగా పంచాలి. ప్ర‌త్యేకించి ప్ర‌త్య‌ర్థుల క‌ళ్ల‌లో ప‌డ‌కూడ‌దు ఈ పంప‌కాలు. ఎక్క‌డైనా ఒక్క చోట వీడియోల‌కు ఎక్కినా ర‌చ్చ ర‌చ్చ అవుతుంది.

Read More రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్

అందులోనూ.. ఏ కోటి రూపాయ‌లో, ప‌ది కోట్ల రూపాయ‌లో అయితే.. గుట్టు చ‌ప్పుడు కాకుండా పంచేయ‌డం పార్టీల‌కు వెన్న‌తో పెట్టిన విద్య‌. మునుగోడులో వ్య‌వ‌హారం వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు చేరింది.

Read More చౌదరి గూడ బి ఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్

ఇలాంటి నేప‌థ్యంలో.. స‌మ‌ర్థులు, న‌మ్మ‌క‌స్తులైన వారితో డ‌బ్బులు పంపిణీ చేయ‌డం కూడా పార్టీల‌కు స‌రికొత్త స‌వాల‌వుతోంది. ఇందుకు సంబంధించి పార్టీలు ఇలాంటి వారిని అన్వేషిస్తున్నాయి. ఈ ప‌నికి పూనుకునే వారికి ల‌క్ష‌కు ప‌ది వేల రూపాయ‌ల క‌మిష‌న్ కూడా ఆఫ‌ర్ చేస్తున్నాయి పార్టీలు.

స‌క్సెస్ ఫుల్ గా ల‌క్ష రూపాయ‌ల‌ను ఓట‌ర్ల‌కు ముట్ట చెబితే ప‌ది వేల రూపాయ‌ల క‌మిష‌న్ ద‌క్కిన‌ట్టే.( వ్యాసకర్త, దేవేందర్ కొన్నే, విశ్లేషకులు)

Views: 0
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ రూ.1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో రూ. 1,072 కోట్ల విలువైన కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ బుధవారం వ‌ర్చువ‌ల్‌గా శంకుస్థాపన చేశారు. వీటిద్వారా 21,079 మందికి ఉపాధి లభిస్తుంది....
ఆడుదాం ఆంధ్ర- ఈ ఆట మనందరిది- ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు
అండగా ఉంటా.... సమస్యలు తీరుస్తా....
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువ శాతం ఉంది
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటితే
ఎంపీ వద్దిరాజు నాగుల్ మీరా దర్గా సందర్శన
ఘనంగా బిఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ