ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను సన్మానించిన కనకాల శివాజీ కురుమ..
On
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ను సన్మానించిన కనకాల శివాజీ కురుమ
ఎల్బీనగర్, నవంబర్ 16(న్యూస్ ఇండియా ప్రతినిధి): ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నివాసంలో కురుమల సాంప్రదాయము వస్త్రమైనటువంటి కురుమ గొంగడితో హైదరాబాద్ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ కనకాల శివాజీ కురుమ ఆయన నివాసంలో కుటుంబ సమేతంగా వెళ్లి ఘనంగా సన్మానించారు. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా నియామకానికి సహకరించిన ఎమ్మెల్సీని సన్మానించడం తనకెంతో సంతృప్తినిచ్చిందని హైదరాబాద్ మార్కెట్ కమిటీ నూతన డైరెక్టర్ కనకాల శివాజీ కురుమ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ....కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కురుమ, కురుమ కుల పెద్దలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Views: 7
About The Author
Related Posts
Post Comment
Latest News
సామాజిక మానత్వం కోసం జమాఅత్-ఏ-ఇస్లామీ హింద్
08 Dec 2024 13:39:17
రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఖాలిద్ ముబష్షిర్ జఫర్
Comment List