తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

On
 తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డు అందుకున్న పసుపులేటి సుజాత

న్యూస్ ఇండియా తెలుగు,నవంబర్ 17( నల్గొండ జిల్లా ప్రతినిధి):తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా రాష్ట్రాల లోనీ వివిధ రంగాలలో ప్రావీణ్యం కలిగిన కళాకారులకు ఈరోజు చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో డాక్టరేట్ అవార్డులను అర్హులకు tssst సంస్థ అందించారు. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన గాయనిమని పసుపులేటి సుజాత కు తెలుగు సంస్కృతి సాహితీసేవ ట్రస్టు ఆధ్వర్యంలో "హానర్ ఇస్ కాస్ "డాక్టరేట్ అవార్డు ను ఈరోజు అందించారు. ఈ సందర్భంగా పసుపులేటి సుజాత మాట్లాడుతూ సంస్థ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనతోపాటు వివిధ రంగాల్లో పురస్కారాలు అందుకుంటున్న ప్రతి ఒక్క కళాకారులకు అభినందనలు తెలియజేశారు .ఈ సత్కారం ,ఈ గౌరవం, కళాకారుల అభిమానం, ఎన్నటికీ మరువలేనని ఇంకా మరింత బాధ్యతతో కళా రంగంలో తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు .ఈ అవార్డును అందుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న కళాభిమానులందరికీ, నా తోటి కళాకారులకు, గాయని గాయకులకు, సంగీత సాహితీ ప్రియులకు ,కృతజ్ఞతలు తెలిపారు.

IMG-20241117-WA0026

Views: 145

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Related Posts

Post Comment

Comment List

Latest News

ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్!
ఉద్యోగుల పొట్టకొట్టి.. బోర్డు తిప్పేసిన హాస్పిటల్! హాస్పటల్ ముందు ఆందోళన చేస్తున్న సిబ్బంది.. రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, మే 29, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఉద్యోగులకు మూడు...
పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం