తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతం..

On
తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు.

IMG-20250123-WA1023
కబడ్డీ క్రీడలను రిబ్బన్ కట్ చేసిన ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగా రెడ్డి..

తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత...

ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి...

ఎల్బీనగర్/ అబ్దుల్లాపూర్మెట్, జనవరి 23 (న్యూస్ ఇండియా ప్రతినిధి):- అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి పురస్కరించుకొని ఏర్పాటుచేసిన కబడ్డీ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరై ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఒక క్రీడాకారుడిగా క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తెలియజేయడం జరిగింది. కబడ్డీ క్రీడా జాతీయ క్రీడ అని గ్రామీణ ప్రాంత క్రీడాకారులు కబడ్డీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ నెలకొల్పుతున్నట్లు తెలియజేశారు. బాటసింగారం గ్రామంలో సమస్యలు లేకుండా చూస్తానని అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందజేస్తారని తెలియజేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగా రెడ్డి టాస్ వేసి కబడ్డీ క్రీడలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడ్డి గన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఈసీ శేఖర్ గౌడ్, చామ విజయ శేఖర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరా చారి, పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్ పర్సన్ పండుగల జయశ్రీ రాజు, వైస్ చైర్మన్ చామ సంపూర్ణ విజయ శేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ బుర్రరేఖ మహేందర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి సభ్యులు బింగి దేవదాస్ గౌడ్, స్థానిక మాజీ ఎంపీటీసీ సభ్యులు కేశెట్టి వెంకటేష్, కొ ఆప్షన్స్ సభ్యులు గౌస్ పాషా, మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు మోడెపు గణేష్ గౌడ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Post Comment

Comment List

Latest News

మర్రి"తో "మాచన" అనుభందం... మర్రి"తో "మాచన" అనుభందం...
"మర్రి"తో "మాచన" అనుభందం  "మర్రి చెన్నారెడ్డి" లో శిక్షణ అనుభవం.. రంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 15, (న్యూస్ ఇండియా ప్రతినిధి): పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్...
ధాన్యం సేకరణ ఓ క్రతువు..
దాహార్తిని తీర్చండి
మినీ మేడారం జాతరకు  ప్రత్యేక బస్సు
డొమెస్టిక్ సిలిండర్లు హోటళ్ళ లో ఎలా ఉన్నాయ్..
ఘనంగా 49వ సింగరేణి హై స్కూల్ వార్షికోత్సవం 
రేషన్ అక్రమార్కులపై పి డి యాక్ట్ ఖాయం..