యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

On
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

నల్గొండ జిల్లా, ఫిబ్రవరి 22, న్యూస్ ఇండియా ప్రతినిధి:-

IMG-20250223-WA0534
యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ దంపతుల పూజలు.. స్వర్ణ విమాన గోపురం ప్రారంభం..

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో దివ్య విమాన స్వర్ణ గోపుర ఆవిష్కరణకు సంబంధించి 'పంచ కుండాత్మక మహా కుంభాభిషేక సంప్రోక్షణ' మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 23, ఆదివారం) సీఎం రేవంత్ రెడ్డి సతీసమేతంగా గుట్టకు హాజరై మహాపూర్ణాహుతిలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పంచతుల బంగారు విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఉదయం ప్రత్యేక హెలీకాప్టర్ లో యాదగిరిగుట్టకు వెళ్లిన సీఎం.. మొదటగా గుట్టపైన ఉన్న యాగశాలకు చేరుకున్నారు. ఆలయ ఈవో, అధికారులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ఆలయ పరిసరాలు, అభివృద్ధి పనులు పర్యవేక్షించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంపై ఏర్పాటు చేస్తున్న స్వర్ణ విమాన గోపురం దేశంలోనే అతి ఎత్తయిన ఏకైక స్వర్ణ విమాన గోపురం. దాదాపు 68 కిలోల బంగారంతో స్వర్ణతాపడం చేశారు. స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవంలో సీఎం తో పాటు సీఎస్ శాంతాకుమారి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Post Comment

Comment List

Latest News

కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు కాంగ్రెస్ కార్యాలయానికి భూమి కేటాయింపు
•సీఎం రేవంత్ రెడ్డికి డీసీసీ కార్యాలయం కోసం మంత్రి తుమ్మల విన్నపం•స్థలం కేటాయింపుకు క్యాబినెట్  ఆమోదం•బుర్హాన్ పురంలోని ఎన్ఎస్పి సర్వేనెంబర్ 93 లో ఎకరం స్థలం  కేటాయింపు...
వరిదాన్యం కేంద్రాలపై సమీక్ష సమావేశం
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లు గ్రానైట్ లారీ బోల్తా
తొర్రూర్ బస్టాండ్ సెంటర్లో గ్రానైట్ లారీ బోల్తా
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..
వార్తాపత్రికలో అరుదైన గౌరవం దక్కించుకున్న గుద్దేటి రమేష్ బాబు
తెలంగాణ రాష్ట్రం బందును విజయవంతం చేయాలి