సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..

On
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..

సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..

రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం, అక్టోబర్ 18

IMG-20251016-WA1272
సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరం..

, న్యూస్ ఇండియా ప్రతినిధి:

మహేశ్వరం పరిసర గ్రామాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహేశ్వరంతో పాటు ఇందిర ప్రియదర్శిని కళాశాల నాంపల్లి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోల్కొండ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న 7 రోజుల జాతీయ సేవా పథక (NSS) ప్రత్యేక శిబిరంలో భాగంగా “Self Grooming” అనే అంశంపై అర్ధదిన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా కుమారి ప్రశాంతి పాల్గొన్నారు. తన ప్రసంగంలో కుమారి ప్రశాంతి మాట్లాడుతూ.. సెల్ఫ్ గ్రూమింగ్ ప్రతి యువతికి అవసరమైన అంశం. వ్యక్తిత్వ వికాసంలో ఆత్మ విశ్వాసం, సొగసైన ప్రదర్శన, సమయానికి తగిన తీరు ఎంతో ముఖ్యమైనవి” అని పేర్కొన్నారు. సెషన్ సందర్భంగా ఆమె స్వయంగా మేకప్, హెయిర్ స్టైల్, చీర కట్టడం పై ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఇంటర్వ్యూ స్కిల్స్, ప్రెజెంటేషన్ టెక్నిక్స్, మరియు చోరియోగ్రఫీ పై విద్యార్థులకు ప్రేరణాత్మక మార్గదర్శనం చేశారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని, ఈ కార్యక్రమం ద్వారా తాము కొత్తగా చాలా విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. ఈ సెషన్‌ను విజయవంతంగా నిర్వహించిన కుమారి ప్రశాంతిని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మహేశ్వరం ఎన్.ఎస్.ఎస్. అధికారిణి డాక్టర్ జహీదా బేగం, ఇందిర ప్రియదర్శిని కళాశాల నాంపల్లి ఎన్.ఎస్.ఎస్. అధికారులు చంద్రశేఖర్, శ్రీకాంత్, ఉదయశ్రీ, అనిత, ప్రభుత్వ డిగ్రీ కళాశాల గోల్కొండ ఎన్.ఎస్.ఎస్. అధికారిణి హుమేర సయీద్ సత్కరించి అభినందించారు. తరువాత విద్యార్థి వాలంటీర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. వాలంటీర్లు  అందరితో కలిసి ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.

Views: 28

About The Author

Post Comment

Comment List

Latest News

రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత రఘునాధపాలెం మండలం కె.వి బంజర గ్రామ సర్పంచ్ బరిలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూక్య సరిత
ఖమ్మం డిసెంబర్ 8 న్యూస్ ఇండియా ప్రతినిధి (ఉపేందర్) ఖమ్మం రఘునాథపాలెం మండలం కేవీ బంజర గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భూక్యా...
రఘునాథపాలెం మండలం గణేశ్వరం గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థి భూక్య నాగేశ్వరరావు
చెరువు కొమ్ముతండా గ్రామ సర్పంచ్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భుక్య భాష
అతి చిన్న వయసులో సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన మాలోతు భార్గవి
ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుగులోతు నాగేశ్వరరావు
తండ్రి బాటలో తనయుడు గుగులోతు మూర్తి
చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రతిభ చాటుతున్న ఆకుల చంద్ర దీప్షిక