క్షయ వ్యాధి నివారణ కు పొగాకు కు దూరంగా ఉండండి...

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

On
క్షయ వ్యాధి నివారణ కు పొగాకు కు దూరంగా ఉండండి...

క్షయ వ్యాధి నివారణ కు పొగాకు కు దూరంగా ఉండండి...

పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

రంగారెడ్డి జిల్లా,

IMG-20250203-WA0377(1)
పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్..

మార్చి 24 (న్యూస్ ఇండియా ప్రతినిధి): పొగాకు, ధూమపానం అలవాట్ల ప్రభావాన్ని తక్కువగా అంచనా వేయడం వల్లే..క్షయ వ్యాధి తీవ్రత అధికం అవుతోందని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాసిల్దార్ మాచన రఘునందన్ అన్నారు. మార్చి 24 ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ లో మాట్లాడుతూ.. క్షయ వ్యాధి కి పొగాకు కారకం అవుతుంది అన్న విషయం పై అవగాహన కలిగి అప్రమత్తంగా.. ఉండాల్సిన అవసరం ఉందన్నారు. క్షయ వ్యాధి కి, చికిత్స కంటే  నివారణ నే మంచిదని హితవు చెప్పారు.ఒకవేళ, క్షయ వ్యాధి వచ్చినట్లైతే దానిని ముందుగా గుర్తించి చికిత్స చేయించుకోవడం ఉత్తమం అని సూచించారు. క్షయ వ్యాధి వచ్చిందని ఈ ఆధునిక కాలంలో భయపడవలసిన అవసరంలేదన్నారు. టీ బి కి పూర్తి స్థాయిలో చికిత్సఉందని స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే..పొగాకు, ధూమపానం అలవాట్ల కు దూరంగా ఉండక పోవడం వల్ల నో ఆ అలవాట్లు ఉన్న వారితో దూరంగా ఉండక పోవడం వల్ల కూడా క్షయ ప్రాణాలను సైతం బలితీసుకునే అవకాశం లేకపోలేదని రఘునందన్ హెచ్చరించారు. మన దేశంలో క్షయ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికి చాలామందికి అవగాహన ఉన్నప్పటికీ పొగాకు, ధూమపానం అలవాట్ల ను వాటి పర్యవసానాలను తక్కువగా అంచనా వేయడం వల్లే క్షయ ముదిరాక ఆ దశ లో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారుతోందన్నారు. కొన్ని లక్షణాలను బట్టి క్షయ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుందన్నారు. అయితే ముఖ్యంగా ప్రజలకు విఙ్ఞప్తి చేసేది ఏమిటంటే పొగ త్రాగడం వలన, పొగాకు అలవాటు వల్ల,ఆ అలవాట్లు ఉన్న వారితో అత్యంత సాన్నిహిత్యంగా మెలగడం వల్ల,క్షయ సోకే ప్రమాదం చాలా వుంది. ఈవ్యాధి బారినపడి పలువురు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా చాలా నష్ట పోతున్నారు. ఎవరైనా సరే ధూమపానానికి దూరంగా వుండడం మంచిది.పొగ తాగవద్దని, ధూమ పానానికి దూరంగా వుండాలని ఈ సందర్భంగా మాచన రఘునందన్ జన బాహుళ్యాన్ని కోరారు.

Read More ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ మంథని శివ యాదవ్. 

Views: 10

About The Author

Post Comment

Comment List

Latest News

స్థానిక యుద్దానికి మేం సిద్ధం  స్థానిక యుద్దానికి మేం సిద్ధం 
భద్రాద్రి కొత్తగూడెం(న్యూస్ ఇండియా)జనవరి 27:జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా...
ఫిబ్రవరి 11న తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు
5 రోజుల బ్యాంకింగ్ విధానాన్ని అమలు చేయాలి
మేడారం జాతరకు బస్సులు
తొర్రూరులో డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తొర్రూర్ లో డబల్ బెడ్రూంలో పరిశీలన, పలు వార్డులలో అభివృద్ధి పనుల శంకుస్థాపన చేసిన మంత్రి
డబుల్ బెడ్ రూమ్ ల పరిశీలన,ద లో అభివృద్ధి పనుల శంకుస్థాపన