చలివేంద్రం ఏర్పాటు
కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్
కొడకండ్ల, మే 7: మండుతున్న ఎండల దృష్ట్యా, రైతులకు సౌకర్యంగా ఉండాలనే దృక్పథంతో కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ శ్రీమతి నల్ల అండాలు శ్రీరామ్ గారు రైతుల కోసం వినూత్నమైన చర్య చేపట్టారు. ధాన్యం అమ్మడానికి వచ్చే రైతులకు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పిస్తూ మార్కెట్ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రం ఏర్పాటు చేయించడం జరిగింది. చలివెంద్రాన్ని ఆమె ఆకుపచ్చ రిబ్బన్ కత్తిరించి ప్రారంభం చేశారు
ఈ కార్యక్రమం ద్వారా రైతులు ఎండలో నిలబడకుండా నీరు తాగుతూ, విశ్రాంతి తీసుకుంటూ తమ ధాన్యం విక్రయ ప్రక్రియను సులభంగా కొనసాగించగలుగుతున్నారు
ఈ చలివేంద్రం ఏర్పాటు రైతుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
చైర్పర్సన్ శ్రీరామ్ గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ, “రైతులు మన దేశ కర్తలే. వారి కష్టం అర్థం చేసుకొని చిన్న సహాయం చేయాలని ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఎండలు తీవ్రమైన నేపథ్యంలో వారికొరకు ఇది కొంతైనా ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నాం,” అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమాన్ని చూసి అనేకమంది స్థానికులు కూడా అభినందనలు తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ తీసుకున్న ఈ మంచి పథకం ఇతర ప్రాంతాల్లోనూ ఆదర్శంగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమం లో వైస్ చేర్మెన్ ఈరెంటి సాయి కృష్ణ, డైరెక్టర్లు క్రాంతి కుమార్ నామాల, ఈదయ్య, ముత్యాల, పూర్ణచందర్, వనంమోహన్బత్తుల వెంకన్న,దేశగాని నాగరాజు, పాల్గొన్నారు,
Comment List