వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 02, న్యూస్ ఇండియా : ప్రత్యేక పుష్పలంకరణ వస్త్ర అలంకరణ చేసిన అమ్మ వారిని భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రం, లోని సరస్వతి నగర్, లో గల శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం వైభావంగా జరిగింది. ఈ సందర్బంగా అమ్మ వారికీ కుంభాభిషేకం, ఈ వార్షికోత్సవ కార్యక్రమం లో భాగంగా అర్చకులు గజవాడ శేషాచారి, మీనా నాథ్ శర్మ ఆర్చక బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ హోమం, మహ హారతి నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో ఆలయ వ్యవ స్థాపక కమిటీ సభ్యులు కోడిదే లింగమ్మ యాదగిరి దంపతుల ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమం లో ఆలయ భక్త బృందం శ్రీధర్ మహేంద్ర రాజు, వినయ్ విట్టల్, శ్రీశైలం, కుమార్, రవి, సందీప్, మహేష్, కుమార్, సుమన్, మల్లేష్, ప్రమోద్, పవన్, హన్మంత్ పవన్, సంతోషి శ్రీనిత, స్రవంతి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Comment List