నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.., సెక్షన్ 144/ 163 BNSS అమలు.

On
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు..,  సెక్షన్ 144/ 163 BNSS అమలు.

అభ్యర్థులు అడ్మిట్ కార్డులో పొందుపరిచిన నియమ నిబంధనలను తప్పక పాటించాలి. అత్యవసర సమయాలలో జిల్లా కంట్రోల్ నెంబర్ 8712656739 కు కాల్ చేయండి. జిల్లా పోలీసు అధికారులతో నీట్ పరీక్ష బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 02, న్యూస్ ఇండియా : నీట్ పరీక్ష అభ్యర్థులకు పరీక్షా కేంద్రానికి చేరుకునే సమయంలో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నట్లైతే వెంటనే జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నెంబర్ 8712656739 కు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపిఎస్ సూచించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఆదివారం ఉదయం నుండే పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఈ నెల 4వ తేదీ ఆదివారం జరగనున్న నీట్ (యూ.జి)  పరీక్ష దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్ వివరించారు.  మధ్యాహ్నం 2 - 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్ష కేంద్రంలోనికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్, / ( 144 ) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడానికి వీలులేదని, 100 మీటర్స్ లోపల ఉన్న అన్నీ జిరాక్స్ షాప్ మూసివేయాలన్నారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకొని వెళ్లరాదన్నారు. అన్నీ పరీక్ష కేంద్రాలు సిసి కెమెరాల పర్యాయవేక్షణలో ఉంటాయన్నారు. సంబంధిత పోలీస్ అధికారులు ప్రతి ఒక్క అభ్యర్ధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని, పరీక్షా సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. పటిష్ట బందోబస్తు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. 
అభ్యర్థులకు సూచనలు: 
అభ్యర్థులు అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు, 2- పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, 1- పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకొని రావాలని అన్నారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లల యొక్క ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకూడదని తెలియజేశారు. షూస్, సాక్స్, బెల్ట్, బంగారు,వెండి, ఇతర ఆభరణాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవని, ఇవి లేకుండా అభ్యర్థులు పరీక్షకు రావాలని సూచించారు. ఫుల్ షర్ట్స్ కి అనుమతి లేదని, హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి.  ట్రాన్స్పరెంట్/ పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అడ్మిట్ కార్డ్ నందున్న సూచనలు పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ గారు అభ్యర్థులు సూచనలు చేశారు. ఈ సమీక్షలో అదనపు.ఎస్పీ ఎ.సంజీవ రావ్, సంగారెడ్డి డియస్పీ సత్యయ్య గౌడ్, ఎ.ఆర్ డియస్పీ నరేందర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్, రూరల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సుమన్, ఆర్.ఐ లు రామ రావ్, డానియెల్ తదితరులు ఉన్నారు. WhatsApp Image 2025-05-02 at 6.39.53 PM

Views: 7
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక... వైయస్సార్సీపి కర్నూలు జిల్లా యువజన విభాగం సెక్రటరీగా ఆర్. శివరామి రెడ్డి ఎన్నిక...
పెద్దకడుబూరు మండలం / న్యూస్ ఇండియా ప్రతినిధి షబ్బీర్ షా జూలై 01 :-  వైయస్ఆర్సిపి రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి...
నమ్మించి ఓట్లు దండుకున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి జగన్ సార్..!
పెద్దకడుబూరు మండలం : డ్రైనేజీలు, వీధిలైట్లు మరియు త్రాగునిటీ సమస్యలు పరిష్కరించండి... సిపిఐ
రైతుల సంక్షేమమే మా ప్రభుత్వ ఉద్దేశం..
జిల్లాలో నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు
జీవితాలను ఛిద్రం చేసిన 'సిగాచి ఫార్మా'
ఘనంగా ఐరిస్ ఫ్లోరేట్స్ వరల్డ్ స్కూల్ ప్రారంభం..