కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 03, న్యూస్ ఇండియా : జిల్లా లో భూ భారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి , గ్రామ రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలను శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. శనివారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం లో అదనపు కలెక్టర్ మాధురి,ఆర్ డి ఓ లు, తహశీల్దార్లు, ఆర్ ఐ లతో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ... కొండాపూర్ మండలం లో ఈ నెల 5 తేదీ నుండి 19తేదీ వరకు, 23 గ్రామాలలో గ్రామ స్థాయిలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలని, గ్రామాల్లో భూ సమస్యలు శాశ్వితంగా పరిష్కరించాలన్నారు. గ్రామ భూ భారతి రెవెన్యూ సదస్సులలో అధికారులు టీంలు గా ఏర్పడి,టీం వర్క్ చేయాలన్నారు. అధికారుల సమన్వయం తో పని చేయాలన్నారు. ఈ సదస్సులు గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలని, సదస్సు నిర్వహించే అధికారులకు స్టేషనరీ,కంప్యూటర్స్ లు అందించాలని ,ఈ రెవెన్యూ సదస్సులో 3 హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ లలో సీనియర్ లేదా జూనియర్ అసిస్టెంట్ల ను నియమించాలన్నారు. ఒక కంప్యూటర్ ఆపరేటర్ ను, ఒక తహసిల్దార్ ను,ఏం పీ డి వో, ఏం, పి ఓ ల డెస్క్ లు తప్పని సరి ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీరు ఇతర సమస్యలపై కూడా ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.గ్రామాల్లో టామ్ టామ్,వేసి విస్తృత ప్రచారం చేసి భూ భారతి రెవెన్యూ సదస్సులలో ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు.రెవెన్యూ చట్టం పై అధికారులు అవగాహన కల్గి ఉండాలన్నారు . భూ సమస్యలపై దరఖాస్తు చేసుకోవడానికి వచ్చే వారినుంచి దరఖాస్తులు పత్రాలు అందచేసి, క్షుణ్ణంగా పరిశీలించి జాగ్రత్తగా హెల్ప్ డెస్క్ లో ఉన్న వారు మాత్రమే దరఖాస్తును నింపాలన్నారు. ప్రజలు వారి భూ సంబంధిత సమస్యలతో వచ్చినపుడు భూ పత్రాల జిరాక్స్ తీసుకొని సదస్సులో హాజరుకావాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన భూ సమస్యలను తెలుసుకొని ఆ ఆ మండలాల్లో, గ్రామాల్లో ఉన్న సర్వే నంబర్ కు ఆయా సమస్యకు ఒక కోడ్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి భూ సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, జాగ్రత్తగా రికార్డు చేయాలన్నారు. అన్ని భూ సమస్యల ధరఖాస్తులను తెరస్కరించకుండా ఆన్లైన్ రికార్డు చేయాలన్నారు. ప్రతి భూ సమస్యను క్షేత్ర స్థాయిలో తనికి చేసి పరిష్కరించాలనీ పేర్కొన్నారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టెంట్, త్రాగునీరు,సైన్ బోర్డులు, ఫ్లెక్సీలు,మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మాధురి, డిఆర్ఓ పద్మజ రాణి, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రవీందర్ రెడ్డి, తాసిల్దార్ అశోక్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comment List