అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.

On
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.

ప్రతి కేసులో నాణ్యమైన ధర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయాలి. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఎన్.బి.డబ్ల్యూ ఎగ్జిక్యూషన్ లో పురోగతి.. అదనపు.ఎస్పీ అండ్ టీం ను అభినందించిన జిల్లా ఎస్పీ. మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా అధికారులకు పలు సూచనలు చేసిన.. జిల్లా ఎస్పీ. పరితోష్ పంకజ్ ఐపియస్.

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 03, న్యూస్ ఇండియా : మంత్లీ క్రైమ్ రివ్యు మీటింగ్ లో భాగంగా తేదీ. 03-05-2025 రోజు సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో అధికారులతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపియస్ నెల వారి నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ… అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్, మిస్సింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు అండగా ఉండాలని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలని సూచించారు. అత్యాచార, పొక్సో కేసులలో ధర్యాప్తును వేగవంత చేయాలని, నిర్ణిత గడువులో దోషులను న్యాయస్థానం ముందు ఉంచాలని అన్నారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ఈ కేసుల ఛేదనకు సర్కిల్ పరిధిలో స్పెషల్ టీం లను ఏర్పాటు చేయాలన్నారు. యన్.బి.డబ్ల్యూ, మిస్సింగ్ కేసుల ఛేదనకు అదనపు.ఎస్పీ గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టీమ్స్ ద్వారా సత్:ఫలితాలను రాబట్టడం జరిగిందని, అదనపు ఎస్పీ అండ్ టీం ను ఎస్పీ అభినందించారు. ఆస్తి సంభందిత నేరాలకు సంబంధించి పాత నేరస్తులపై నిఘా ఉంచాలని, పాపిలోన్ డివైస్ ను వినియోగించి, ఛాయిస్ ప్రింట్ ద్వారా కేసులను ఛేదించాలని అన్నారు. యన్.డి.పి.యస్. కేసులలో నేరస్తులపై హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలని, వాణిజ్య పరంగా 20 కిలోల బరువు కలిగిన గంజాయిని అక్రమ రవాణా చేసిన గంజాయి స్మగ్లర్ల ఆస్తులను కోర్టుకు అటాచ్ చేయాలని, అలవాటు పడిన నేరస్తులపై పిట్ యన్.డి.పి.యస్ యాక్ట్ కు సిఫార్సు చేయాలన్నారు. WhatsApp Image 2025-05-03 at 1.50.32 PMఆన్లైన్ బెట్టింగ్స్, బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ మోసాలు, డ్రగ్ దుర్వినియోగం, ట్రాఫిక్ రూల్స్ పై జిల్లా ప్రజలలో, విద్యాసంస్థలలో అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని యస్.హెచ్.ఒ లకు సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆన్లైన్ లో వీడియో కాల్స్ చేసి, పోలీసు అధికారులం అంటే నమ్మరాదని, ఏ పోలీసు అధికారులు వీడియో కాల్స్ చేయరాని గుర్తించాలని అన్నారు. డిజిటల్ అరెస్ట్ లు ఉండవు, ఫిజికల్ అరెస్ట్ మాత్రమే ఉంటుందన్నారు. సైబర్ స్లేవరీ పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఇతర దేశాలకు పంపి ఇబ్బందులకు గురిచేస్తారని అన్నారు. జిల్లా ప్రజలు ఆన్లైన్ మోసాల గురించి అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే మొదటి గంట (గోల్డెన్ అవర్) లోపు 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. పోర్టల్ నందు నమోదు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లు గా గుర్తించి, సైన్ బోర్డు లను ఏర్పాటు చేయించాలని సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా ప్రతి రోజు సాయంత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేస్తూ, మద్యం తాగి వాహనాలను నడిపే వాహన దారీలపై కేసులు నమోదు చేయాలని సూచించారు. ఫేక్ నెంబర్ ప్లేట్స్, నెంబర్ ప్లేట్స్ మార్పు పై ప్రత్యేక దృష్టి సారించి, కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. సిసి కెమెరాల ప్రాధాన్యతను వివరిస్తూ అన్నీ కుల మతాలకు చెందిన పవిత్ర స్థలాలలో మరియు పరిశ్రమలలో తదితర ముఖ్యమైన ప్రాంతాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా వివిధ సంఘాల పెద్దలకు అవగాహన కల్పించాలని యస్.హెచ్.ఒ లకు సూచనలు చేశారు. అధికారులు సిబ్బంది పవవిసు స్టేషన్ కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడాలని, ఇబ్బందులతో పోలీసు స్టేషన్ కు వచ్చే వారికి వారిలో ధైర్యాన్ని నింపాలని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సంగారెడ్డి డియస్పి సత్యయ్య గౌడ్, పటాన్ చెర్వు డియస్పి రవీందర్ రెడ్డి, జహీరాబాద్ డియస్పి రామ్ మోహన్ రెడ్డి, నారాయణ ఖేడ్ డియస్పి వెంకట్ రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, నార్కోటిక్ / ఐటి సెల్ ఇన్స్పెక్టర్ కిరణ్, కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ రవి మరియు జిల్లా ఇన్స్పెక్టర్స్, సబ్ఇన్స్పెక్టర్స్, తదితరులు పాల్గొన్నారు.

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికట్ట పెద్ద వెంకన్న బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎలికట్ట పెద్ద వెంకన్న
  న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక కొడకండ్ల ప్రతినిధి మే 4 జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల  గ్రామంలో బోలోజు సోమలక్ష్మి  తెల్లవారుజామున 1 గంట
అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు పరిమిత లిమిట్ లో ఉండాలి.
అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
కొండాపూర్ మండలం లోని ప్రతి గ్రామంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు పకడ్బందీగా నిర్వహించాలి... జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు.., సెక్షన్ 144/ 163 BNSS అమలు.
మే 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలంలో రెవెన్యూ సదస్సులు.
వైభావంగా శ్రీ విద్యా సరస్వతి దేవత ఆలయ వార్షికోత్సవం.