శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

ద్వి చక్రవాహనాల ‘సైలెన్సర్ల’ వైనం

On
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!

సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 07, న్యూస్ ఇండియా : సంగారెడ్డి పట్టణ, రురల్ ప్రాంతాల్లో 'ద్వి చక్ర వాహన దార్లు కొంతమంది చేస్తున్న 'శబ్ద కాలుష్యాన్ని' భరించలేకపోతున్నామని ఆ ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి పట్టణంలోని రూలర్ పోలీస్ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత బస్టాండు నుండి కొత్త బస్టాండ్ కలెక్టరేట్, సంగారెడ్డి ఎక్స్ రోడ్ బైపాస్ రోడ్డు  ఇతర కాలనీలలో మెయిన్ రోడ్డు ప్రాంతాలల్లో శబ్ద కాలుష్యాన్ని సృష్టించి సాధారణ జనాలను నానా ఇబ్బందులపాలు చేస్తున్నారు .ద్విచక్ర వాహనదారులు బుల్లెట్ వాహనదారులు రోడ్లపై తిరిగేటప్పుడు సైలెన్సర్లు మార్చుకొని రద్దీగా ప్రజలు ఉండే స్థలాలలో పెద్ద శబ్దంతో రోడ్లపై తిరుగుతున్నప్పటికీ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్టుగా ఉంటున్నారని కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని ఈ ప్రాంత ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు.  సంగారెడ్డి పట్టణంలో ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా కూడా ప్రయాణం చేస్తూ, మైనర్లు కూడా వాహనాలు నడుపుతూ అతివేగంగా ప్రయాణం చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి పట్టణంలో రాత్రి వేళల్లో కొందరు వాహనదారులు అతివేగంగా నడుపుతూ, ఈ ప్రతేక్య అతి పెద్ద శబ్దాల వల్ల ఆ వాహనాలు పెద్ద శబ్దంతో వారి వారి ఇండ్లలో నిద్రపోతున్న వారికి నిద్రలేకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని, అయినప్పటికీ  పోలీసులు మాత్రం తనిఖీలు చేయకపోవడం గమనార్ధం. జిల్లా ఎస్పీ స్పందించి రోడ్లపై అతి పెద్ద శబ్దంతో సైలెన్సర్లు తీసివేసి రోడ్లపై తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.8bddebdb-6c12-425d-9cee-5a572df1deff

Views: 3
Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు. ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం...
ఉగ్రవాదం పై కఠిన చర్యలు తీసుకోవాలి.
‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
శబ్ద కాలుష్యం భరించలేక పోతున్నాం!
చలివేంద్రం ఏర్పాటు
హత్నూర, గుమ్మడిదల పోలీసు స్టేషన్ల ఆకస్మిక తనిఖీ.