‘రక్త సిందూరం’ ప్రతీకార చర్యలు భేష్.
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : పహల్గం దాడికి తగిన రీతిలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ తో ప్రతీకార చర్యలు తీసుకోవడంలో భారత సైన్యం చర్యలు భేష్ అని యావత్తు జాతి హర్షించ దగ్గ పరిణామమని బి ఆర్ ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ సమర్థించారు. మన సైన్యం ఎదుట ఎవరి ఆటలు నడవలేని విధంగా జవాబు చెప్పారని ‘మన సైన్యం పై హర్షతి హర్షం’ వ్యక్తం చేశారు. ఈ నెపథ్యంలో ప్రపంచంలో భారత దేశం గొప్ప దేశమని, భారత సైన్యం కూడా చాలా సమర్థ వంతమైందని, ఇతర దేశాలు మనతో మంచిగా ఉంటే స్నేహంగా ఉంటాం, లేదంటే దానికి తగ్గట్టుగా దిటుగా సమాధానం ఇస్తాము అని, పహాల్గామ్ దాడికి ఆపరేషన్ సింధూర్ దీనికి నిదర్శనం అని సాధిఖ్ కొనియాడారు. దరిమిలా పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం బాలగాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను సాధిఖ్ స్వాగతిo చారు. వెరసి పాకిస్థాన్ లోని మూడు ఉగ్రవాద సంస్థలకు చెందిన తొమ్మిది శిబిరాల్లో దాకున్న ఉగ్రవాదులను పెద్ద సంఖ్యలో హత మార్చిన భారత సైన్యానికి అభినందనలు అని సాధిఖ్ అన్నారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల ఏరివేతకు భారత త్రివిధ దళాలు ఈ దాడులు చేపట్టినందుకు దేశ మంత గర్వపడుతు మన సైన్యం పై హర్షాలు వ్యక పరుస్తున్నారని సాధిఖ్ కొనియాడారు.ఆపరేషన్ సింధూర్ పై పాకిస్థాన్ కు గట్టిగ గుణ పాఠం చెప్పారని, ఉగ్రవాదుల పై మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని, పాకిస్థాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని, ఆపరేషన్ సింధూర్ కు జై జవాన్, జై హింద్ అంటూ సాధిఖ్ మద్దతు పలికారు. ఆపరేషన్ సింధూర్ భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడిగా గర్వపడుతున్నానని, ఉగ్రవాదం, ఉన్మాదం, ఏ రూపంలో వున్నా ఏ దేశం లో వున్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేది తప్ప లాభం చేకూర్చేది కాదని సాధిఖ్ నొక్కి చెప్పారు. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో మేమేవరికి తక్కువ కాము అన్నట్లుగా వారికి శక్తి సామర్థ్యలు ఉండాలని ప్రార్థిస్తున్నన్ని సాధిఖ్ అన్నారు. సింధూర్ ఆపరేషన్ పోరాటంలో తమంతా అండగా నిలుస్తామని, జై జవాన్, జై హింద్ అని సాధిఖ్ అన్నారు.
Comment List