ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు.
On
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 08, న్యూస్ ఇండియా : ఆర్యవైశ్యుల కుల దైవం సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో బుధవారం అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో ఐబీ నుంచి అమ్మవారి దేవాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. వాసవి మాతకు పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. మహిళలు లలిత సహస్రపారాధన చదివి కుంకుమార్చనలు జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు ఆమెటి పాండయ్య, కార్యదర్శి ఇల్లింతల రాజు, కార్యనిర్వాహక కార్యదర్శి కొంపల్లి విద్యాసాగర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు తోపాజి హరీష్, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 8
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
05 Mar 2026 10:09:16
కొన్ని వార్డుల్లో పని చేయని ఫ్యాన్లు బాత్రూమ్ లు రోగుల ఇబ్బందులు
పట్టించుకొని అధికారులు..

Comment List