సమాచారం ఇవ్వని అసమర్థ అధికారులు.!
సంగారెడ్డి జిల్లా, బ్యూరో చీఫ్, మే 07, న్యూస్ ఇండియా : సి ఎం కార్యాలయం సమాచారం ఇవ్వాలని కోరిన,… సమాచారం ఇవ్వని అధికారుల పై ఉన్నత అధికారులకు ‘ఎం శ్రీధర్’ అప్పీలు దరఖాస్తు చేశారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన ఎం శ్రీధర్ అనే సమాచార హక్కు సామాజిక కార్యకర్త తేది 01-03-2025 నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయనికి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా కోరినారు. తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ లో సమాచార కమిషనర్ ల భర్తీ కోసం దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు, వారి భర్తీకి సంబందించిన నోట్ ఫైల్స్ నఖలు కాపీలు వాటి పురోగతి కి సంబందించిన సమాచారం తెలుపగలరు అని దరఖాస్తు చేయగా… అట్టి దరఖాస్తును సి ఎం ఓ కార్యాలయం తేది 07-03-2025 నాడు సమాచార హక్కు చట్టం సెక్షన్ 6(3 ) ప్రకారం, ప్రజా సమాచార అధికారి సహాయ కార్యదర్శి సాధారణ పరిపాలన శాఖ (జి ఏ డి )తెలంగాణ ప్రభుత్వం వారి కార్యాలయం సచివాలయనికి బదిలి చేశారు. గడువు ముగిసి రెండు నెలలు అయిన, సాధారణ పరిపాలన శాఖ ప్రజా సమాచార అధికారి ఇప్పటి వరకు సమాచారం ఇవ్వని దుస్థితి కొనసాగుతున్నది. ఏదేమైనప్పటికీ దరఖాస్తులో కోరిన పూర్తి సమాచారం సంబందించిన అధికారి నుండి ఇప్పించాలని కోరుతూ ఎం శ్రీధర్. అప్పీల్ ను పోస్ట్ ద్వారా పంపించారు.
Comment List