బెంగాల్ పాలిటిక్స్

On

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఉప్పు-నిప్పులా వ్యవహరించే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య కొంత సయోధ్య నెలకొంటోందని తెలుస్తోంది. తీవ్ర విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీ బెంగాల్ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారి (Suvendu Adhikari) తో కాసేపు సమావేశమయ్యారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సుబేందు తన తమ్ముడు లాంటి వాడని సంభోదించారు. టీ తాగేందుకు రావాలని […]

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ (West Bengal) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ఉప్పు-నిప్పులా వ్యవహరించే భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల మధ్య కొంత సయోధ్య నెలకొంటోందని తెలుస్తోంది.

తీవ్ర విమర్శలు చేసుకుంటూ నిత్యం వార్తల్లో నిలిచే తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బీజేపీ బెంగాల్ శాసనసభాపక్ష నేత సుబేందు అధికారి (Suvendu Adhikari) తో కాసేపు సమావేశమయ్యారు.

రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో సుబేందు తన తమ్ముడు లాంటి వాడని సంభోదించారు. టీ తాగేందుకు రావాలని కూడా పిలిచారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. దీదీ తనను టీ తాగేందుకు పిలిచారని, అయితే తాను టీ తాగలేదని సుబేందు చెప్పారు. కేవలం మర్యాద పూర్వక భేటీ తప్ప మరేమీ లేదని తేల్చి చెప్పారు.

Views: 4
Tags:

About The Author

News India Telugu Desk Picture

ఏ పార్టీలకు కొమ్ముకాయకుండా..నీతి , నిజాయితీలే పెట్టుబడులుగా నిఖార్సైన వార్తలను అందిస్తోంది న్యూస్ ఇండియా తెలుగు దినపత్రిక. మెరుగైన సమాజం ధ్యేయంగా డైనమిక్ జర్నలిజాన్ని ప్రోత్సహిస్తోంది. 

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే