ఆపదలో ఆపన్నహస్తం....!!

టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ

On
ఆపదలో ఆపన్నహస్తం....!!

ఆపదలో ఆపన్నహస్తం....!!

టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ

IMG-20260409-WA1084
ఆర్థిక సహాయం అందించిన టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ

రంగారెడ్డి జిల్లా, ఎల్బీనగర్, ఏప్రిల్ 09, న్యూస్ ఇండియా ప్రతినిధి: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం నిజమైన మనుష్యత్వమని మరోసారి రుజువైంది. వేలకోట్ల ఆస్తులు ఉన్నా సహాయం చేయాలనే మనసు లేకపోతే ప్రయోజనం లేదని, కానీ కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలవడమే గొప్పదనమని టీజీ కాబ్ మాజీ వైస్‌ చైర్మన్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య కురుమ చాటిచెప్పారు. వివరాల్లోకి వెళితే… ఆపదలో ఉన్న తెలంగాణ ఉద్యమకారుడు నక్క జంగయ్య గౌడ్ కుటుంబానికి సత్తయ్య కురుమ ఆపన్నహస్తం అందించారు. జంగయ్య గౌడ్ కుమార్తె అనూష కాలేయ వ్యాధితో బాధపడుతుండగా, చికిత్స కోసం సుమారు రూ.80 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించినట్లు తెలిసింది. పేద కుటుంబానికి చెందిన జంగయ్య గౌడ్‌కు అంత భారీ ఖర్చు భరించే పరిస్థితి లేకపోవడంతో విషయం తెలుసుకున్న సత్తయ్య కురుమ వెంటనే స్పందించి రూ.25 వేల చెక్కును అందజేశారు. అంతేకాకుండా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులతో మాట్లాడి చికిత్సకు అవసరమైన నిధులు సమకూరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జంగయ్య గౌడ్ కుటుంబానికి సహాయం చేయదలిచిన వారు 9347096677 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు జెనిగె విష్ణువర్దన్‌, కొంతం యాదిరెడ్డి, కారింగుల నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 31

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు పంటల వ్యర్థాలను దహనం చేస్తే కేసులు తప్పవు
​మాటేడు గ్రామ శివారులో జరిగిన అగ్నిప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఇటీవల మాటేడు గ్రామ...
టిప్పర్ ఒరిగి కలకలం.. తప్పిన పెను ప్రమాదం..
పంట వ్యర్థాలను తగలబెడితే కఠిన చర్యలు
పెద్దవంగరలో రోడ్డు ప్రమాదం
ప్రభుత్వాన్ని కూల్చేద్దాం | Tamil Politics Biggest Twist..! | GeethaMedia Telugu
వెలికట్టలో ఘోర రోడ్డు ప్రమాదం
ఉప సర్పంచుల చెక్ పవర్ తొలగిస్తే  ఉద్యమమే