మహిళ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా కళాశాల వార్షికోత్సవ వేడుకలు
ముఖ్యఅతిథిగా ఐఎఫ్ఎస్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రం సింగ్ డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ మాధవి
ఖమ్మం ఏప్రిల్ 10 ఖమ్మం న్యూస్ ప్రతినిధి: ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ భానోత్ రెడ్డి ఆధ్వర్యంలో కళాశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సిద్ధార్థ విక్రం సింగ్,ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ మాధవి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ విక్రం సింగ్ మాట్లాడుతూ.. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని అన్నారు.విద్య అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవడానికె కాదు,తమ నైపుణ్యం ప్రదర్శించి ఉన్నత స్థాయిలోకి ఎదిగి పది మందికి ఉపాధి కల్పించే విధంగా మారాలని గుర్తింపు పొందాలని ఉన్నారు.దానికి ఉదాహరణగా తన జీవిత ప్రయాణం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులకు విద్యలో ప్రతిభ కనబరిచిన వారికి,ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు.విద్యార్థులు నూతన ఉత్సాహంతో కేరింతలు చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comment List