అధ్యాపకులు బి.నాగేశ్వరరావు కి జిజెసి రేబ్బన ప్రిన్సిపాల్‌గా పదోన్నతి
ఖమ్మం జిల్లాలో విశేష సేవలు అందించిన అధ్యాపకులు నాగేశ్వరరావు
ఖమ్మం ఏప్రిల్ 27 ఖమ్మం న్యూస్: ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సెక్రటరీ బి. నాగేశ్వర్ రావు ప్రభుత్వ జూనియర్ కళాశాల నేలకొండపల్లిలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా సేవలందిస్తూ ప్రస్తుతం జిజెసి రేబ్బన ప్రిన్సిపాల్‌గా పదోన్నతి పొందిన సందర్భంగా విద్యావర్గాల్లో హర్షం వ్యక్తం చేశారు.గత 18 సంవత్సరాలుగా జంతుశాస్త్ర అధ్యాపకుడిగా విశేష సేవలందించిన ఆయన విద్యార్థుల విద్యాభివృద్ధికి అంకితభావంతో పనిచేశారు.బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్ష విభాగంలో అనేక కీలక కార్యక్రమాల్లో పాల్గొని తన ప్రతిభను నిరూపించారు.ఖమ్మం జిల్లాలో 2018 సంవత్సరం నుండి ఇప్పటివరకు నిర్వహిస్తున్న EAPCET / NEET ఉచిత కోచింగ్ క్యాంపులలో కోఆర్డినేటర్ గా ప్రధాన పాత్ర పోషిస్తూ వందలాదిమంది విద్యార్థులకు ఉన్నత విద్యకు మార్గదర్శకత్వం అందిస్తున్నారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు పోటీ పరీక్షలపై అవగాహన కల్పించి మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు.అలాగే (జిజేఎల్ ఏ) సంఘంలో కార్యకర్తగా,బాధ్యుడిగా సంఘ పిలుపునకు స్పందిస్తూ ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు.అధ్యాపక హక్కుల కోసం,ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి,విద్యా ప్రమాణాల పెంపు కోసం నిరంతరం కృషి చేశారు.విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, మోటివేషన్ క్లాసులు నిర్వహిస్తూ,బిసి, ఎస్సీ స్టడీ సర్కిల్స్‌లో గ్రూప్స్ విద్యార్థులకు విషయ నిపుణుడిగా సలహాలు అందిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు.ఇలాంటి సేవా తపన కలిగిన అధ్యాపకునికి జిజెసి కొమరం భీమ్ ఆసిఫాబాద్ రేబ్బన ప్రిన్సిపాల్‌గా పదోన్నతి రావడం పట్ల డిఐఈఓ కె రవి బాబు, ప్రిన్సిపల్ సంఘ అధ్యక్షులు సింహాచలం కార్యదర్శి నవీన జ్యోతి,(జిజేఎల్ ఏ)సంఘ అధ్యక్షులు,డి ప్రమీల,సంఘ బాధ్యులు,సంఘ అధ్యక్షులు,బాధ్యులు,సహచర అధ్యాపక మిత్రులు,సంఘ నాయకులు నేలకొండపల్లి కళాశాల ప్రిన్సిపాల్ ఎల్ వెంకటేశ్వర్లు,అధ్యాపకులు,విద్యార్థులు అభినందనలు తెలియజేశారు.


Comment List